Begin typing your search above and press return to search.
మహారాష్ట్ర సీఎం మాటలకు వత్తాసేంటి కేసీఆర్?
By: Tupaki Desk | 1 April 2016 4:06 AM GMTపేరుకు ఒకే దేశమైనా.. రాష్ట్రాల వారీగా తమ ప్రయోజనాలు మాత్రమే ఆయా రాష్ట్రాలు చూసుకోవటమే తప్పించి.. తాము చేపట్టే ప్రాజెక్టుల కారణంగా పక్కనున్న రాష్ట్ర ప్రజలు తీవ్రఇబ్బందులకు గురి అవుతారన్న ఆలోచన ఏ రాష్ట్రానికి ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ అలాంటి పద్ధతే లేదనుకుంటే.. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఆయా రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీలే నిదర్శనం.
తెలుగు ప్రభుత్వాలు నిర్మించే ప్రాజెక్టుల మీద ఇటు మహారాష్ట్ర కానీ.. అటు కర్ణాటక కానీ తెలుగు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బ తీస్తూ అన్నేసి ప్రాజెక్టులు కట్టే వారే కాదు. అంతదాకా ఎందుకు.. ఒకే రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం.. తెలంగాణ ప్రాంతానికి సమైక్య పాలకులు తీరని ద్రోహం చేశారన్న విమర్శలు చేయాల్సిన అవసరం ఉండదు.
అంటే.. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమిటంటే.. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా.. మొదట తమ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తుందే తప్ప.. అవతలి రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసే ఛాన్సే లేదన్నది స్పష్టమవుతుంది. మరి.. ఇదే నిజమైతే.. ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ చేసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు తప్పుల తడక అని.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని తేల్చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన వాదనకు తోడుగా నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లేఖను ప్రస్తావించటం ఏమిటి?
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టును తప్పు పడితే.. అది తమ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అంటే.. మహారాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ పడుతున్నాయన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్రోశాన్ని.. కేసీఆర్ తన వాదనకు తగినట్లుగా అన్వయించుకోవటం.. తెలంగాణ ప్రాంతానికి అవసరంగా అభివర్ణించటం చూసినప్పుడు.. కేసీఆర్ చెప్పే లెక్కలో ఏదో తేడా ఉన్నట్లుగా అనిపించటం ఖాయం. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు విషయంలోనూ ఇలాంటి కిరికిరి కనిపించక మానదు. సమైక్య పాలనలోనే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని పట్టించుకోని నాటి తెలుగు ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పే కేసీఆర్.. తెలంగాణలో నిర్మించే ఒక ప్రాజెక్టు పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేవనెత్తిన అభ్యంతరాల్ని తన వాదనకు వత్తాసుగా చూపించటం ఏంటి..?