Begin typing your search above and press return to search.

సీఎంగా కేసీఆర్ ముహూర్తం ఖరారు!?

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:10 PM GMT
సీఎంగా కేసీఆర్ ముహూర్తం ఖరారు!?
X
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ కూడా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. కౌంటింగ్ పూర్తి కావడం కంటే ముందే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేలిపోతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తానే ముఖ్యమంత్రి అని ఘంటాపథంగా చెబుతున్నారు. అంతే కాదు... ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల ప్రకటన చేసినస్పటి నుంచి తమకు వంద స్ధానాలు తప్పవని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ లెక్క కాసింత తగ్గవచ్చు కాని... అధికారంలోకి రావడం మాత్రం ఖాయమనే ధీమాగా ఉన్నారు. దీంతో రెండో వరుసగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తన పదవీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

సోమవారం సాయంత్రం మజ్లిస్ పార్టీ నాయకులు అసదుద్దన్ ఒవైసీ - ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసారు. ఇద్దరి భేటీ అనంతరం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కల్వకుంట్ల చంద్రశేఖర రావేనని - తమ మద్దతు ఆయనకే ఉంటుందని మజ్లిస్ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు తేదీని - ముహూర్తాన్ని కూడా ఖరారు చేసారంటున్నారు. ఈ నెల 12 వ తేదిన రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారంటున్నారు. ఆ రోజు శ్రవణ నక్షత్రం కావడం - అది కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు క్షేమతార కావడంతో ఆ రోజే ప్రమాణం చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం డిసెంబర్ 15 వ తేదీన‌ ప్రమాణం చేస్తారని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు 6 వ తేదీ కలిసొస్తుంది. ఆయన తెలంగాణ శాసనసభను రద్దు చేయడం - ముందస్తును ప్రకటించడం కూడా ఆరో తేదినే చేశారు. అలాగే తొలి విడత అభ్యర్ధులను కూడా 105 మందిని ప్రకటించారు. దీంతో ప్రమాణ స్వీకారం కూడా డిసెంబర్ 15 వ తేదిన చేస్తారని అంటున్నారు. మొత్తానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకుంటున్న కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అని ధీమాగా ఉన్నారు.