Begin typing your search above and press return to search.
వాడకం అంటే ఏంటో ఎన్నారైలకు చూపిస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 18 April 2018 10:56 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహానికి తాజా తార్కాణం. ఇప్పటికే తన పార్టీని బలోపేతం చేసుకోవడం, పరిపాలనపై ప్రశంసలు కురిపించేందుకు ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున జంపింగ్‌లు చేయించిన గులాబీ దళపతి మీడియాను సైతం మేనేజ్ చేసుకోని ఆల్ ఈజ్ వెల్ అనే రీతిలో వాతావరణం సృష్టిస్తున్నారనే అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సానుకూల ప్రచారంతో కేసీఆర్ దూసుకువెళుతున్నారు. అయితే స్థానికంగా ఓకే కానీ..విదేశాల్లో ఎలా? అందుకే కేసీఆర్ కొత్త ప్లాన్ ఆలోచించారని అంటున్నారు. అదే పర్యాటక శాఖ ద్వారా ఎన్నారైలను కనెక్ట్ చేసి స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చుకోవడం అనే ప్లాన్ అమల్లో పెట్టారని చెప్తున్నారు.
ఇంతకీ తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన తాజా స్కీం ఏంటంటే...తెలంగాణలో పర్యాటకరంగాన్ని విస్తృతం చేసేందుకు ప్రవాస తెలంగాణ వాసులను అంబాసిడర్ లుగా నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ అంబాసిడర్లుగా గుర్తింపు పొందినవాళ్లు తాముంటున్న దేశాల్లోని పర్యాటకులను తెలంగాణలో పర్యటించేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది. తమ తమ దేశాల్లో స్థానికంగా జరిగే ఉత్సవాలు - సమావేశాలు - గెట్ టుగెదర్ - పార్టీలు.. ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా తెలంగాణలో ఆలయాలు - చారిత్రక కట్టడాలు - ప్రకృతి అందాలు..ఇతర ఆకర్షణీయమైన అంశాలను ప్రచారం చేయాలి. ఇందుకోసం పర్యాటకానికి సంబంధించిన వాల్ పోస్టర్లు - కరపత్రాలు - అల్బమ్ లను టూరిజం శాఖ అందిస్తుంది. టూరిజం అంబాసిడర్లుగా ఉన్న ఎన్నారైలకు విదేశీ పర్యాటకులు రాష్ట్రంలో పర్యటించే షెడ్యూల్‌ను అనుసరించి రివార్డు పాయింట్లను.. అందుకు తగిన విలువను కేటాయిస్తారు. ఈ పాయింట్ల విలువమేరకు వచ్చేమొత్తాన్ని ఆయా ఎన్నారైల సొంతగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు - సామాజిక - సంక్షేమ - సేవా కార్యక్రమాల నిర్వహణకు వారి తరుపున ఖర్చుపెడుతారు. తద్వారా వారికి మంచిపేరు ప్రఖ్యాతులు వస్తాయి.
ఇది స్కీం. ఈ లెక్కన తెలంగాణ ఎన్నారైలు పర్యాటక ప్రచారం చేసే సమయంలో సహజంగానే...స్వరాష్ట్రంలో మన పర్యాటక - ఆధ్యాత్మిక ఆహ్లాద కేంద్రాలు నిరాదరణకు గురయ్యాయని పేర్కొంటూ స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే వాటికి మహర్దశ దక్కిందనే విషయాన్ని ఎలాగూ వెల్లడిస్తారు. తద్వారా ఇటు పర్యాటక పరిశ్రమకు మంచి రోజులు, టీఆర్ ఎస్ పార్టీకి - గులాబీ దళపతి కేసీఆర్ కు ఉచిత ప్రచారం వస్తుందని అంటున్నారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో ఈ స్కీంను ప్రారంభించడం వెనుక మతలబు ఇదేనని చెప్తున్నారు.