Begin typing your search above and press return to search.

124 ఏళ్ల క్రితం రాసిన చట్టాన్ని బయటకు తీసిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   23 March 2020 9:10 AM GMT
124 ఏళ్ల క్రితం రాసిన చట్టాన్ని బయటకు తీసిన కేసీఆర్!
X
వణికించే కరోనా పుణ్యమా అని కొత్త కొత్త పదాలు.. అంతకు మించిన అరుదైన పరిణామాల్ని చూడాల్సి వస్తోంది. మొన్నటివరకూ క్వారంటైన్ అన్న మాట తెలీని సామాన్యులు సైతం ఇప్పుడు తరచూ ఆ పదాన్ని వాడేస్తున్నారు. షట్ డౌన్.. లాక్ డౌన్ లాంటి మాటలతో పాటు.. వివిధ మందుల పేర్లను అలవోకగా వాడేస్తున్నారు. ఇదంతా కరోనా పుణ్యమేనని చెప్పాలి. ఇదిలా ఉంటే.. కరోనా వేళ.. అప్పుడెప్పుడో తీసుకొచ్చిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకొంది. దాదాపు 124 ఏళ్ల క్రితం నాటి చట్టాన్ని కరోనా వేళ బయటకు తీసుకొచ్చిన రాష్ట్ర సర్కారు.. అప్పట్లో.. నాటి పరిస్థితులకు తగ్గట్లుగా రాసిన చట్టాన్ని.. ఇవాల్టికి అమలు చేయాలని నిర్ణయించటం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు.. అప్పట్లో వచ్చిన పరిస్థితులు ఆ తర్వాత మళ్లీ తలెత్తకపోవటంతో.. దాన్ని వాడాల్సిన అవసరం రాలేదు.

కరోనా పుణ్యమా అని.. నియంత్రణ విధించాల్సి వచ్చిన వేళ.. ఏం చేయాలన్న విషయాన్ని.. దానికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయన్నది చూసినప్పుడు.. అప్పుడెప్పుడో 124 ఏళ్ల క్రితం తయారు చేసిన చట్టం గురించి చెప్పుకొచ్చారు అధికారులు. సాధారణంగా పాత చట్టాలకు తాజా పరిస్థితుల్ని జేర్చి తన మార్క్ వేసే ప్రయత్నం చేస్తుంటారు కేసీఆర్. ఆ సందర్భంగా అప్పుడెప్పుడో చట్టం.. ఇప్పటికి అదేనా? అంటూ పెదవి విరిచే ఆయన.. తాజా పరిస్థితుల్లో అలాంటి మాటలు ఏ మాత్రం అనకుండా దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

ఎందుకిలా అంటే.. వైద్య ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఏమేం చేయాలి? ఎలా చేయాలి? ఏం చేస్తే మంచిది? ఎవరిని ఎలా నియంత్రణలో ఉంచాలి? లాంటి వాటి విషయాల్లో ఆ చట్టానికి మించింది మరొకటి లేదు. దీంతో.. మరో ఆలోచన లేకుండా తన ఆలోచనలకు.. తాజాగా నెలకొన్న పరిస్థితులకు సరిపోయే 124 ఏళ్ల నాటి చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చేశారు కేసీఆర్.