Begin typing your search above and press return to search.
అదరగొట్టే నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్.. సూపర్ స్పైడర్లకు టీకా
By: Tupaki Desk | 26 May 2021 4:30 AM GMTగతానికి భిన్నంగా గడిచిన కొద్ది రోజులుగా కొవిడ్ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహా యాక్టివ్ గా ఉంటున్నారు. అధికారులతో బ్యాక్ టు బ్యాక్ రివ్యూలు చేస్తున్న ఆయన.. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వినూత్నంగా ఉండటంతో పాటు.. ఇప్పటివరకు ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు బాస్ అన్నట్లుగా ఆయన తీరు ఉండటం గమనార్హం. అయితే ఫాంహౌస్ కాదంటే ప్రగతిభవన్ కు మాత్రమే పరిమితమయ్యే ఆయన..సికింద్రాబాద్ గాంధీ.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులను చూశాక.. అక్కడి కొవిడ్ పేషెంట్లతో మాట్లాడిన తర్వాత ఆయన మైండ్ సెట్ లో మార్పు వచ్చిందన్న మాట వినిపిస్తోంది.
కొవిడ్ ను గతంలో ఆయన చూసిన కోణానికి భిన్నంగా.. యమా సీరియస్ గా తీసుకోవటమే కాదు.. రోజువారీగా వచ్చే కోట్లాది పన్ను ఆదాయం కంటే కూడా ప్రజారోగ్యం మిన్న అన్నమాట బలంగా కేసీఆర్ నోటి నుంచి వినిపిస్తోంది. అవసరమైతే అప్పు తెచ్చి వైద్య వసతులు కల్పిద్దామని ఆయన చెబుతున్నారు. కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు వీలుగా.. ఆయన కొన్ని నిర్ణయాల్ని చకచకా తీసుకుంటున్నారు.
లాక్ డౌన్.. వ్యాక్సినేషన్ తో కరోనా వ్యాప్తిని తగ్గించొచ్చన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన.. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న సూపర్ స్పైడర్లు ఎంత మంది ఉంటారన్న విషయంపై లెక్కలు వేయించారు వారి సంఖ్య దాదాపు 30 లక్షలుగా ఉంటారని తేల్చారు. ఈ సూపర్ స్పైడర్లను గుర్తించి.. వారందరికి యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఓవైపు రెండో డోస్ వేయిస్తూనే.. మరోవైపు సూపర్ స్పైడర్లకు టీకా వేయించటం ద్వారా వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని చెప్పాలి.
సూపర్ స్పైడర్లు అంటే.. ఎక్కువగా ప్రజలతో కాంటాక్టు ఉండే ఆటో, క్యాబ్ డ్రైవర్లు.. డెలివరీ బాయిస్.. వ్యాపారస్తులు.. పెట్రోల్ బంకుల్లోపని చేసేవారు.. పలువురు ఉంటారు. వీరు నిత్యం వందలాది మందిని కలుస్తుంటారు. ఇలాంటి వారు ఆరోగ్యంగా.. కరోనాకు చెక్ పెట్టేలా వ్యాక్సినేషన్ పూర్తి అయితే.. వారి నుంచి వైరస్ వ్యాప్తి ఆగే వీలుంది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం ప్రకారం 18-45 ఏళ్ల లోపు సూపర్ స్పైడర్లకు టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 10 లక్షల కొవాగ్జిన్ టీకాల్ని కొనగా.. అందులో 2.5 లక్షల డోసులు ఈ రోజు (బుధవారం) తెలంగాణకు చేరుకోనున్నాయి. దీంతో పాటు.. 8.5 లక్షల కొవిషీల్డ్ టీకాల కొనుగోలు పూర్తి అయ్యింది. అందులో వచ్చిన టీకాల్ని వచ్చినట్లుగా ముందు సూపర్ స్పైడర్లకు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది.
అంతేకాదు.. 18 ఏళ్లుదాటిన వారికి సైతం ప్రైవేటులో వ్యాక్సిన్ వేసేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తే.. కేసీఆర్ ఫాంహౌస్.. ప్రగతిభవన్ గడప దాటితే నిర్ణయాలు వినూత్నంగానే కాదు.. వేగవంతంగా ఉంటాయని చెబుతున్నారు.