Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను పుష్కర స్నానం చేయకూడదన్నారు
By: Tupaki Desk | 14 July 2015 3:43 AM GMTపండితుల సలహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుటారు. పూజలు.. పుసస్కారాలు.. ప్రత్యేక యాగాల విషయంలో ఆయన చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనకు నమ్మకం ఉన్న పండితులు.. బ్రాహ్మణ పూజారుల మాటకు చాలా నమ్మకం ఇస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి గోదావరి పుష్కరాల్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత ఆత్రుత పడ్డారో తెలిసిందే. ఇంతా చేస్తే ఆయనిప్పుడు గోదావరిలో పుష్కర స్నానం చేయకూడదని పండితులు సలహా ఇస్తున్నారు. ఈ వ్యవహారం ఆయన్ను ఇబ్బంది పెట్టేదే అయినా.. పరిస్థితి అలాంటిదని చెబుతున్నారు.
కేసీఆర్ సోదరుడు వెంకట్ రావు సతీమణి రెండు రోజుల క్రితం కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం ఇప్పుడు మైలలో ఉంది. కేసీఆర్ తండ్రి.. వెంకట్ రావును దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న నేపథ్యంలో.. సోదరుడి భార్య మరణం కారణంగా మైల సోకుతుందని.. ఈ నేపథ్యంలో పవిత్రమైన పుష్కర స్నానం చేయకూడదన్న మాటను పండితులు చెబుతున్నారు. పండితులు చెప్పే మాటను తూచా తప్పకుండా ఆచరించే కేసీఆర్.. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదన్న మాట వినిపిస్తోంది.
షెడ్యూల్ ప్రకారమే.. గోదావరి పుష్కరాల ఆరంభం సందర్భంగా కేసీఆర్ దంపతులు ధర్మపురిలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రత్యేక స్నానాలు చేశారు. అయితే.. మైల విషయంలో పండితుల సలహాలు తీసుకొనే పుష్కర స్నానం చేసి ఉంటారని చెబుతున్నారు. పద్ధతుల విషయంలో తూచా తప్పకుండా పాటించే కేసీఆర్.. శాస్త్రానికి.. ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే అవకాశం లేదని చెబుతున్నారు. అయినా.. ఈ వాదనల నేపథ్యంలో ఈ విషయంపై ఎవరో ఒకరు వివరణ ఇస్తే బాగుంటుందేమో.