Begin typing your search above and press return to search.
సారు సీన్లోకి దిగారు.. కరోనా చికిత్సపై కీలక నిర్ణయం
By: Tupaki Desk | 5 March 2020 5:06 AM GMTకరోనా గుబులు తెలంగాణను.. అందునా హైదరాబాద్ ను వణికిస్తోంది. ఈ మహమ్మారి హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగికి పాజిటివ్ గా మారటం ఒక ఎత్తు అయితే.. బుధవారం పలువురికి వ్యాపించిందన్న వార్తలతో వాతావరణం ఒక్కసారిగా టెన్షన్ గా మారిపోయింది. పుకార్లు షికార్లు చేయటంతో హైదరాబాద్ మహానగరంలోని ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
కరోనాకు చెక్ పెట్టే మందు లేనప్పటికీ.. ప్రత్యేక చికిత్స ద్వారా ఆ మహమ్మారి నుంచి బయట పడే అవకాశం ఉంది. అయినప్పటికీ లేనిపోని భయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకు అవసరమైన సమయం ఉన్నప్పటికీ.. ఏర్పాట్లు నామమాత్రంగా జరిగాయన్న విమర్శను తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకనిర్ణయాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు.
ఇప్పటివరకూ కరోనాకు వైద్యం చేయాల్సి వస్తే.. గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల్లోనే చికిత్స పొందే వీలుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదనంగా చికిత్స చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు ఓకే చెప్పింది. అయితే.. కరోనాకు సంబంధించిన వైద్యపరీక్షను మాత్రం గాంధీలోనే నిర్వహించి నిర్దారిస్తారు.
ప్రైవేటు భాగస్వామ్యం నేపథ్యంలో రాష్ట్రంలోని ఇరవై ప్రైవేటు వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో మొత్తం వెయ్యికి పైగా ఐసీయూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చిన వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేని పక్షంలో.. వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స జరుపుతారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యాన్ని పూర్తి ఉచితం. బాధితులకు అవసరమైన ఔషధాలు..తదితరాలన్ని ఫ్రీగా అందజేస్తారు.
ప్రభుత్వం ప్రత్యేకంగా కోరటంతో సామాజిక బాధ్యతగా ప్రైవేటు ఆసుపత్రులు ఇందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కరోనాపై 24 గంటలు నిరంతర పర్యవేక్షణ అందించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సిస్టంను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇవాళ.. రేపట్లో ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధం కానున్నాయి. ఇదే పని కరోనా పాజిటివ్ కేసులు బయటకు రాకముందే చేసి ఉంటే ప్రజల్లో ఇంత ఆందోళన వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.