Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ బాటిల్ వాటర్ తాగరా?

By:  Tupaki Desk   |   12 Oct 2021 4:15 AM GMT
సీఎం కేసీఆర్ బాటిల్ వాటర్ తాగరా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన ఒక విచిత్రమైన అలవాటు ఆసక్తికరంగా ఉంటుంది. వీవీఐపీలు.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తమ ఆహార అలవాట్లు.. పద్దతుల విషయంలో ఎంత కచ్ఛితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అందుకు కేసీఆర్ మినహాయింపు కాదు. ఆయన మంచి భోజన ప్రియుడు. చూసేందుకు బక్కపల్చగా ఉండటమేకాదు.. తనను తాను బక్కపల్చటి వ్యక్తిగా కేసీఆర్ చెప్పుకుంటూ ఉంటారు.

కానీ.. ఆయన దంత పుష్టి చాలా ఎక్కువని చెబుతారు. నాన్ వెజ్ నుచాలా ఇష్టంగా తినే కేసీఆర్ మంచి ఫుడ్డీగా చెబుతారు. ఆహార రుచుల్ని పసిగట్టటం ఆయనకు మంచి పేరుందని చెబుతారు. తన భోజనాన్ని సింఫుల్ గా కాకుండా.. కాస్తంత హెవీగా తీసుకోవటం కేసీఆర్ కు అలవాటు. ఆ మాటకు వస్తే.. మంత్రి కేటీఆర్ లంచ్ కంటే కూడా కేసీఆర్ లంచ్ చాలా గ్రాండ్ గా.. రిచ్ గా ఉంటుందని చెబుతారు.

మంత్రి కేటీఆర్ లంచ్ చాలా సింఫుల్ గా.. ఒకట్రెండు పండ్లు.. లేదంటే సలాడ్ లాంటి చాలా తక్కువ మొత్తంలో ఫుడ్ తీసుకుంటారని చెబుతారు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ లంచ్ మెనూ ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.ఇక.. వాటర్ విషయానికి వస్తే ఆయన మిగిలినవారి మాదిరి బాటిల్ వాటర్ ను అట్టే తాగరని చెబుతారు. ఎప్పుడైతే మరీ తప్పదనిపిస్తే తప్పించి.. బాటిల్ ను ఏకాఏకిగా తాగేయటం ఉండదు. తన భోజనం వేళలో.. ఆయన రాగి గ్లాసులో పోసిన నీళ్లనే తీసుకుంటారు తప్పించి.. మిగిలిన వారి మాదిరి ప్యాకైజ్డ్ వాటర్ బాటిళ్లను వినియోగించటానికి పెద్ద ఇష్టపడరని చెబుతారు. ఈ కారణంతోనే.. ప్రత్యేకంగా భోజనం చేసిన సమయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను పెట్టకుండా.. రాగి గ్లాసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారని చెబుతారు.