Begin typing your search above and press return to search.

రేవంత్ కామెంట్లు లైట్‌...కేసీఆర్ తేల్చేశారు

By:  Tupaki Desk   |   11 March 2018 3:30 PM GMT
రేవంత్ కామెంట్లు లైట్‌...కేసీఆర్ తేల్చేశారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ రాజ‌కీయాల తీరు ఎలా ఉంటుందో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. త‌న అనుకున్న ప‌ని చేసేందుకు ఆయ‌న ఎలా ముందుకు సాగుతారో తెలియ‌జెప్పే మ‌రో నిద‌ర్శ‌నం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌. సాధార‌ణంగా విమ‌ర్శ‌లు ఎదురైతే నాయ‌కులు సంశ‌యిస్తుంటారు. కానీ అదే విమ‌ర్శ‌ల‌ను ఇష్ట‌ప‌డుతూ..ఇంకా చెప్పాలంటే...రెచ్చ‌గొడుతూ ఎదుటివారిని ఆలోచ‌న‌లో ప‌డేయ‌ట‌మే కేసీఆర్ స్టైల్‌. దానికి నిద‌ర్శ‌న‌మే టీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్‌ ను రాజ్య‌స‌భ‌ - అభ్య‌ర్థిత్వాన్ని ఎంపిక చేయ‌డం.

రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వం విష‌యంలో జోగిన‌పల్లి పేరు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ ఖ‌రారు అవుతుంద‌నే అనుకున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేశారు. సంతోష్‌కు రాజ్య‌స‌భ ఇచ్చేయ‌డం అంటే కుటుంబ రాజకీయాల‌కు తెర‌తీయ‌డ‌మే అని వ్యాఖ్యానించారు. ఇంత‌టితో ఆగ‌కుండా..కేసీఆర్‌ ను సంతోష్ బ్లాక్‌ మెయిల్ చేస్తున్నార‌ని కూడా విమ‌ర్శించారు. ఇంటిలోని మ‌నిషికి కాకుండా...అమ‌ర‌వీరుల‌కు చాన్స్ ఇవ్వాల‌ని డిమాండ్‌. అయితే ఇలాంటి వాటిని కేసీఆర్ లైట్ తీసుకున్నారు. సంతోష్‌ కే ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌ద్వారా తానెంటో నిరూపించుకున్నారు!

ఇక జోగిన‌ప‌ల్లి సంతోష్‌ రావు గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి అవ‌గాహ‌న ఉన్న వారికి మాత్రం ఈ పేరు గురించి చాలా స్ప‌ష్ట‌త ఉంటుంది!! సీఎం కేసీఆర్ ద‌గ్గ‌ర పార్టీ, ప్ర‌భుత్వ ప‌ర‌మైన నిర్ణ‌యాలను `ప్ర‌భావితం` చేయ‌డానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొర‌కాలంటే సంప్ర‌దించాల్సింది జోగిన‌పల్లి సంతోష్ రావునే. అంత ప‌ట్టు సీఎం ద‌గ్గ‌ర ఉంద‌న్నమాట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న్ను కేసీఆర్ కుటుంబం నుంచి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకురానున్న‌ట్లు కొద్దికాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఎందుకు కేసీఆర్ అంత ప్రాధాన్యం అంటే...ఈయన స్వయానా కేసీఆర్‌ మరదలి కొడుకు.