Begin typing your search above and press return to search.

అప్పుల గురించి మనం మాట్లాడటమా కేసీఆర్?

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:30 PM GMT
అప్పుల గురించి మనం మాట్లాడటమా కేసీఆర్?
X
అప్పు గురించి కొందరుఅస్సలు మాట్లాడే ఛాన్సు లేదు. ఆ కోవలోకి వచ్చే ముఖ్యమంత్రుల్లో అగ్రభాగాన నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. చేతికి ఎముకలేనట్లుగా వరాలు ఇవ్వటంలో ఆయన ఎంత ఫేమస్సో.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటానికి అవసరమైన నిధుల కోసం అదే పనిగా అప్పులు చేసే టాలెంట్ ఆయన సొంతం. అలాంటి కేసీఆర్ తాజాగా జరిగిన ఖమ్మం బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా అప్పుల గురించి ఆయన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి మాటల్ని వింటే.. ఔరా అనుకోకుండా ఉండలేం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికి దేశానికి లక్ష్యం లేకపోవటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. దేశంలోలక్షల కోట్ల సంపద ఉందని.. పాలన సరిగా ఉండాలే కానీ అప్పు కోసం అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు.

ఈ మాటలన్ని బాగానే ఉన్నా.. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్నితన ఎనిమిదేళ్ల సదవీ కాలంలో అప్పులరాష్ట్రంగా మార్చేసిన కేసీఆర్.. ఇవాల్టి రోజున కేంద్రం చేస్తున్న అప్పుల గురించి మాట్లాడటం.. తిట్టిపోయం చూస్తే.. ఇంతకు మించిన సిగ్గుమాలిన తనం ఉంటుందా?అన్నది ప్రశ్నగా మారింది.

అప్పుల గురించి ఎవరైనా ఆందోళనతో ప్రశ్నలు అడిగితే..వారి మాటల్ని ఎటకారం చేయటం.. భారీ ఎత్తున పంచ్ లు వేసే అలవాటున్న గులాబీ తండ్రీకొడుకుల గురించి తెలిసిందే. అలాంటి వారు.. ఓవైపు అప్పులు చేస్తూనే.. మరోవైపు అప్పులు లేకుండా ఉండాల్సిన అవసరం గురించి చెబితే ఏం బాగుంటుంది? ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవాల్సిన దౌర్భగ్యం పట్టదనే కేసీఆర్.. తన మాటలకు తగ్గట్లే చేతల్లో చూపించి.. తానొక ఉదాహరణగా నిలవాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా అప్పులు చేసిన కేసీఆరే.. ఈ రోజున అప్పుల గురించి మాట్లాడటం.. ప్రధాన మంత్రిని ఏసుకోవటం అంత నప్పే రీతిలోలేదన్న విషయాన్ని గమనిస్తే మంచిది. అప్పులుచేసే వారు.. అప్పులు చేయటానికి మించిన దరిద్రం మరొకటి ఉండదని మాట్లాటంఅర్థం లేనిదిగా చెప్పక తప్పదు.కాదంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.