Begin typing your search above and press return to search.
కేసీఆర్ లో కరోనా మార్పు మరీ ఇంత ఎక్కువగానా?
By: Tupaki Desk | 30 March 2020 5:15 AM GMTకరోనా ఎంతోమందిని మార్చేసింది. దేశాల రూపురేఖల్ని మార్చటేమ కాదు.. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులకు కారణం కానుంది. అలంటి వాటితో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో వచ్చిన మార్పును పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కనిపించదు. కానీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా తన అలవాట్లను మార్చుకునే విషయంలో ససేమిరా అన్నట్లు మొండిగా వ్యవహరించే కేసీఆర్.. కరోనా విషయంలో తగ్గటమేకాదు.. తనను తాను పూర్తిగా మార్చుకున్నారు.
తగ్గినంత మాత్రాన కేసీఆర్ కు పోయేదేమీ లేదు. ఆ మాటకు వస్తే.. మారిన తీరుతో మస్తు మైలేజీ తప్పించి మరింకేమీ లేదనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆరేళ్ల నుంచి ఉన్నా.. గతంలో ఎప్పుడూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యవహరించనంత భిన్నంగా కేసీఆర్ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. కరోనా వేళ.. అన్ని అంశాల్ని తన చేతుల్లోకి తీసుకోవటమే కాదు.. తానే స్వయంగా మార్గదర్శనం చేస్తున్నారు.
ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు అన్ని విషయాల్ని తానే స్వయంగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపు ప్రతి రెండు రోజులకు ఒకసారి (సుమారు) మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
అన్ని విషయాల్నితానే స్వయంగా ప్రజలకు చెప్పేస్తున్నారు. ఇలా తరచూ మీడియా సమావేశాల్ని నిర్వహించే అలవాటు కేసీఆర్ కు లేదు. ఒక రకంగా చెప్పాలంటే.. కరోనా అప్డేట్స్.. కేసీఆర్ స్పెషల్ బులిటెన్ తరహాలో మీడియా ముందుకు వచ్చి.. తాను చెప్పాల్సిన అన్ని అంశాల్ని చెప్పేస్తూ.. ప్రజల్లో ధైర్యాన్ని.. ఆత్మవిశ్వాసాన్ని.. హెచ్చరికల్ని చేస్తున్నారు. అదే సమయంలో.. కొన్ని ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులపై శివాలెత్తుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో.. ఇలాంటి ఎక్స్ ట్రా మాటలే వద్దందన్న ఆగ్రహాం వ్యక్తం చేస్తూనే.. సారీ.. ఎక్స్ ట్రా మాటలకు ఎక్స్ ట్రా సమాధానమే ఇవ్వాల్సి వస్తుందంటూ విరుచుకుపడటం గమనార్హం.