Begin typing your search above and press return to search.

నా దగ్గర ఏపీ సర్వే ఉంది - కేసీఆర్

By:  Tupaki Desk   |   9 April 2019 11:18 AM IST
నా దగ్గర ఏపీ సర్వే ఉంది - కేసీఆర్
X
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు హోరాహోరీ జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అదేమీ లేదని కొట్టి పడేస్తున్నాడు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారని జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే... ‘‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అసలైన సర్వే నా వద్ద ఉంది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాగైతే తాను చెప్పినట్టే సర్వే ఫలితాలు వచ్చాయో - ఆంధ్రాలో కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయో నాకు తెలుసు. చంద్రబాబు నన్ను తిట్టినంత మాత్రాన సర్వే ఫలితాలు మారవు‘‘ అని అన్నారు.

గత పది రోజులుగా తనను చంద్రబాబు తిడుతున్న విషయాన్ని ప్రస్తావించారు కేసీఆర్. అయితే ఆ తిట్లకు కారణం అతని ఫ్రస్ట్రేషనే అని - అతని పరిస్థితి బాగా లేదని చంద్రబాబుకి అర్థమైందని కేసీఆర్ అన్నారు. డిపాజిట్లు కూడా రావడం లేదనే విషయం చంద్రబాబుకు తెలుసని చెప్పిన కేసీఆర్ ఆ బాధతోనే తనపై దాడి చేస్తున్నారని అన్నారు.

జగన్ కి 20 ఎంపీ సీట్లు రాబోతున్నాయి. మాకు 16 సీట్లు వస్తాయి. ఇద్దరివీ కలిస్తే 36 అవుతాయి. ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తాం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.