Begin typing your search above and press return to search.

నా మాట కాదని సమ్మెకు వెళ్లారు.. సుప్రీంకు వెళదాం

By:  Tupaki Desk   |   10 Nov 2019 8:10 AM GMT
నా మాట కాదని సమ్మెకు వెళ్లారు.. సుప్రీంకు వెళదాం
X
డిఫెన్స్ లో గేమ్ ఆడటం అందరూ చేసేదే. కానీ.. అందుకు భిన్నంగా గేమ్ ఆడే రిస్క్ చాలా తక్కువమంది తీసుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడదే సవాల్ ను స్వీకరించారని చెప్పాలి. తనను కాదని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎంతవరకైతే అంతవరకూ వెళదామన్నట్లుగా సీఎం తీరు ఉందంటున్నారు.

తనను కాదని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల విషయాన్ని తేల్చుకోవాలన్నట్లుగా సీఎం కేసీఆర్ తీరు ఉందన్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల తీరుపై గుర్రుగా ఉన్న కేసీఆర్.. తాము లెక్కలన్ని చెబుతున్నా.. హైకోర్టు మాత్రం తాము చెబుతున్న లెక్కల్ని తప్పు పట్టటంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం చెప్పే లెక్కల్ని తప్పులని అంటోందని.. ఆర్టీసీకి చట్టబద్ధత లేదంటోందని.. ఇలాంటప్పుడు మనం మాత్రం ఏం చేయగలం చెప్పందంటూ వ్యాఖ్యానిస్తున్న కేసీఆర్.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.

సోమవారం(నవంబరు 11న) హైకోర్టు స్పందనను చూసిన తర్వాత.. తమకు ప్రతికూలంగా తీర్పు వచ్చిన పక్షంలో సుప్రీంను ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. హైకోర్టు చెప్పినట్లుగా మెట్టు దిగే విషయంలో ససేమిరా అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందంటున్నారు.

ప్రతిసారి ప్రభుత్వానిదే తప్పుడు లెక్కలని కోర్టు చెబుతోందని.. చివరకు ఐఏఎస్ అధికారులు హాజరై వివరణ ఇచ్చిన పాజిటివ్ సమాధానం రావట్లేదన్న వేదనను కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే.. హైకోర్టులో తమకు ఎదురుదెబ్బ తగిలినా వెనక్కి తగ్గకూడదని సుప్రీంను ఆశ్రయించి.. ఈ అంశాన్ని లెక్క తేల్చాల్సిందేనని కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ లో ఎంతో డ్యామేజ్ అయిన కేసీఆర్.. ఇప్పటికి వెనక్కి తగ్గకపోగా మరింత ముందుకెళ్లాలని డిసైడ్ కావటం గమనార్హం.