Begin typing your search above and press return to search.

ఈసారి కేసీఆర్ గురి.. మోడీనా? షానా?

By:  Tupaki Desk   |   11 Oct 2018 5:23 AM GMT
ఈసారి కేసీఆర్ గురి.. మోడీనా?  షానా?
X
తెలంగాణ రాజకీయం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ముంద‌స్తుతో ముందుగా రాజ‌కీయాన్ని ర‌గిల్చిన కేసీఆర్‌పైన ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్‌.. టీడీపీలతో పాటు కోదండం మాష్టారు విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వారికి జ‌త‌య్యారు క‌మ‌లనాథులు. ఎవ‌రెన్ని చెప్పినా.. కేసీఆర్ ను.. ఆయ‌న స‌ర్కారును విమ‌ర్శించే విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తెలంగాణ క‌మ‌ల‌నాథుల‌కు స‌రికొత్త దిశానిర్దేశాన్ని ఇచ్చారు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా.

తాజాగా నిర్వ‌హించిన క‌రీంన‌గ‌ర్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ న‌మ్మ‌క‌ద్రోహి అని.. ఆయ‌న ఇచ్చిన 150 వాగ్దానాల్లో ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేద‌న్నారు. రెండు ల‌క్ష‌ల కొలువులు ఖాళీగా ఉంటే.. ఏ ఒక్క‌టి ఇప్ప‌టివ‌ర‌కూ భ‌ర్తీ చేయ‌లేద‌ని.. ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి ఇవ్వ‌లేద‌ని.. ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చెప్పిన ఆయ‌న తాజా ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కొడుక్కో.. కూతురికో సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

చివ‌ర‌కు అమ‌రుల కుటుంబాల‌ను సైతం కేసీఆర్ మోసం చేసిన‌ట్లుగా మండిప‌డ్డారు. మ‌జ్లిస్ కు కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌న్న ఆయ‌న‌.. టీఆర్ ఎస్ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌న్న మాట‌ను చెప్పేశారు. ఇలా.. కేసీఆర్ మీద ఓ రేంజ్లో నిప్పులు చెరిగిన అమిత్ షా మాట‌లు ఇప్పుడు కొత్త క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్‌.. టీడీపీల‌ను బండ‌కేసి బాదేసిన‌ట్లుగా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న కేసీఆర్‌.. బీజేపీని పెద్ద‌గా అనింది లేదు.

తాజా అమిత్ షా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కేసీఆర్ త‌దుప‌రి మీటింగ్ లో క‌మ‌ల‌నాథుల‌పై క‌త్తి దూయ‌టం ఖాయ‌మంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ నోటి మాట తీవ్ర‌త ఎంత ఉంటుంద‌న్న విష‌యాన్ని ప‌డ‌ని అమిత్ షా లాంటోళ్ల‌కు.. ఈసారి చుక్క‌లు క‌నిపించ‌టం ఖాయ‌మంటున్నారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీని ఫాసిస్ట్ గా అభివ‌ర్ణించ‌టం ద్వారా కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టించారు. ఆ మాట‌ల్ని మ‌న‌సులో ఉంచుకున్న మోడీ.. కేసీఆర్ ను కొన్నేళ్ల పాటు త‌న ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేద‌ని చెబుతారు. ఈ మ‌ధ్య‌నే మోడీ.. కేసీఆర్ ల మ‌ధ్య స‌హృద్బావ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్న మాట‌లు వినిపిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా కేసీఆర్ పాల‌న‌పై సునిశిత విమ‌ర్శ‌ల‌తో పాటు.. ఆయ‌న‌పై వ్య‌క్తిగ‌తంగా కూడా వ్యాఖ్య‌లు చేసిన అమిత్ షా తీరుతో కేసీఆర్ అందుకు త‌గిన స‌మాధానం త‌న ప్ర‌సంగం ద్వారా చెప్ప‌టం ఖాయ‌మంటున్నారు. మొత్తంగా చూస్తే. అమిత్ షా వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా ఆయ‌న వ‌ర‌కే తన విమ‌ర్శ‌ల్ని ప‌రిమితం చేస్తారా? లేక‌.. ప్ర‌ధాని మోడీ మీదా విరుచుకుప‌డ‌తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రాఫెల్ డీల్ ఎపిసోడ్ లో ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న బీజేపీ అధినాయ‌క‌త్వానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట‌లు మ‌రింత మంట పుట్టించ‌టం ఖాయ‌మంటున్నారు. కేసీఆర్ ను కెలికితే ఎలా ఉంటుందో చూస్తార‌ని కొంద‌రు గులాబీ నేత‌లు అంటుంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ న‌డిచింది కానీ.. ఇక మోడీషాల‌కు కేసీఆర్ మాట‌ల‌తో ఇత్త‌డే అంటూ మండిప‌డుతున్నారు గులాబీ బాబులు. మ‌రి.. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.