Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు కేసీఆర్ గాలం?

By:  Tupaki Desk   |   10 Aug 2018 5:47 PM GMT
కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు కేసీఆర్ గాలం?
X
రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతున్నాయి. త‌మ పార్టీలో గెలుపు గుర్రాలెవ‌రు....త‌మ‌కు ఎదురు నిలుస్తున్న ప్ర‌త్య‌ర్థులెవ‌రు...అని ఆయా పార్టీలు బ‌లాబ‌లాల‌ను బేరీజు వేసుకుంటున్నాయి. అయితే, తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం...ఓ స‌రికొత్త వ్యూహంతో ముందుకు పోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొన‌డానికి బదులు....వారిని త‌మ పార్టీలో చేర్చుకొని...ప్ర‌త్య‌ర్థులే లేకుండా చేయాల‌ని గులాబీ బాస్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నార‌ట‌. న‌ల్గొండ జిల్లాలో మంచి ప‌ట్టున్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు గులాబీ కండువా వేసి కాంగ్రెస్ ను చావుదెబ్బ తీయాల‌ని యోచిస్తున్నార‌ట‌. అసెంబ్లీ నుంచి కోమ‌టిరెడ్డి ని స‌స్పెండ్ చేసిన కేసీఆర్....అనూహ్యంగా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ను పార్టీలో చేర్చుకోవ‌డంపై వాక‌బు చేయ‌డంతో న‌ల్గొండ జిల్లా నేత‌లు షాక‌య్యార‌ట‌.

కాంగ్రెస్ కు న‌ల్గొండ‌లో మంచి ప‌ట్టుంది. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ వ‌ల్ల అది సాధ్య‌మైంద‌ని, అందుకు వారిని త‌మ పార్టీలో చేర్చుకొని రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ను దెబ్బ‌కొట్ట‌వ‌చ్చ‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యంపై న‌ల్గొండ జిల్లా టీఆర్ ఎస్ నేత‌ల‌కు స్వ‌యంగా కేసీఆర్ ఫోన్ చేశార‌ట‌. అయితే, కేసీఆర్ ఇష్ట‌మే ...త‌మ ఇష్ట‌మ‌ని వారు బ‌దులిచ్చార‌ట‌. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కూడా టీఆర్ ఎస్ ఎంపీల‌తో న‌ల్గొండ‌ రాజ‌కీయాల గురించే గులాబీ బాస్ మాట్లాడార‌ట‌. సీఎల్పీ నేత‌గా ఉన్న వెంక‌ట్ రెడ్డి....ఎమ్మెల్సీ గా ఉన్న రాజ‌గోపాల్ త‌మ ఉనికిని న‌ల్గొండ‌లో బ‌లంగా చాట‌డంతో కేసీఆర్ ఆ ర‌కంగా ఆలోచిస్తున్నార‌ట‌. ఈ నెల‌లో రాహుల్ ..2 రోజుల హైద‌ర‌బాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే ముందే....కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు గులాబీ కండువా క‌ప్పి షాకివ్వాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు, పీసీపీ పీఠంపై కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎప్ప‌టినుంచో క‌న్నువేశారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం లేదు. దీంతో, టీఆర్ ఎస్ లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తే....వారు కూడా మ‌న‌సు మార్చుకునే అవ‌కాశాలున్నాయ‌ట‌. అయితే, ఈ ప్ర‌చారం పై వారు స్పందించ‌డం లేదు. మ‌రి, ఈ పుకార్లు...ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో వేచి చూడాలి.