Begin typing your search above and press return to search.
కేసీఆర్ అప్పు లక్ష్యం 30వేల కోట్లకు పైనే?
By: Tupaki Desk | 3 Dec 2015 4:47 AM GMTభారీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది వార్షిక బడ్జెట్ కు సంబంధించి కసరత్తు తీవ్రంగా సాగుతున్న వేళ.. బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు.. అందుకు అవసరమైన నిధులకు సంబంధించి తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్షేమ కార్యక్రమాల కోసం భారీగా నిధులు కేటాయించాలని భావిస్తున్న నేపథ్యంలో.. అందుకు తగిన నిధుల సర్దుబాటు అవసరం అవుతుంది.
దీనికి పరిష్కారంగా వచ్చే వార్షిక సంవత్సరంలో రూ.30వేల కోట్లకు పైనే అప్పులు తేవాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందులో రూ.20వేల కోట్ల బడ్జెట్ ద్వారా.. మిగిలిన 10వేల కోట్లకు పైగా రుణం వివిధ కార్పొరేషన్ల ద్వారా సేకరించాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు దాదాపు 15 శాతం ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు మరింత అప్పు తెచ్చుకునే వీలు కలుగుతుంది.
అయితే.. తెలంగాణ సర్కారు అంచనా వేసినంత భారీగా అప్పు తెచ్చుకునే వీలు కలుగుతుందా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. దీనికి ఈ ఏడాది అనుభవమే పెద్ద నిదర్శనంగా చెబుతున్నారు. ఎందుకంటే..ఈ ఏడది కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవటం ద్వారా రూ.16,968 కోట్లు రుణం తెచ్చుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ.. కేంద్రం నుంచి అనుమతులు రాకపోవటంతో.. ఈ స్థాయిలో రుణం తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే వార్షిక బడ్జెట్ లో అప్పు అంచనాలపై కేంద్రం నిర్ణయం కీలకం కానుంది. అయితే.. ప్రస్తుతం అమలు అవుతున్న చట్టాల్లో మార్పు పక్కా అని భావిస్తున్న నేపథ్యంలో.. మరింత అప్పుతెచ్చుకునే అంశంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ దిశగా బడ్జెట్ లో అప్పు అంచనాల్ని భారీగా పెంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.