Begin typing your search above and press return to search.

కేసీఆరే టార్గెట్..రాహుల్ తెలంగాణ టూర్

By:  Tupaki Desk   |   23 July 2018 10:34 PM IST
కేసీఆరే టార్గెట్..రాహుల్ తెలంగాణ టూర్
X
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అలా భేటి అయ్యిందో లేదో అప్పుడే రాహుల్ గాంధీ ప్లాన్ సిద్ధం చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా అధిష్టానం రాహుల్ ను ఖరారు చేయగానే ఆయన రాష్ట్రాల పర్యటనకు ప్లాన్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే ఆయన పర్యటనలు పెట్టుకున్నారు..

తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆగస్టు నెలలో రాహుల్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. వచ్చే నెలలో చేపట్టే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లో రాహుల్ పర్యటన సాగనుంది. సంస్థాగతంగా సాంకేతికంగా బలోపేతంపైన రాహుల్ గాంధీ దృష్టిపెట్టనున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కడో ఒక దగ్గర బహిరంగ సభ లో కూడా రాహుల్ పాల్గొంటారని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు చెబుతున్నారు..

కాగా రాహుల్ ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించగానే తెలంగాణ పర్యటన పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. సీఎం కేసీఆర్ డబుల్ స్టాండర్డ్ గా వ్యవహరిస్తుండడం.. కాంగ్రెస్ ను తిడుతూ.. అదే సమయంలో బీజేపీతో లోపాయికారిగా వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ ముఖ్యనేతలకు మింగుడు పడడం లేదు. పైగా కాంగ్రెస్ తో సాన్నిహిత్యం నెరిపే బెంగాల్ సీఎం మమతా - కుమారస్వామి లాంటి వాళ్లను కూడా ప్రభావితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కు షాకివ్వాలనే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను పెట్టుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.