Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు షాక్.. టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
By: Tupaki Desk | 18 Sep 2018 10:12 AM GMTకాంగ్రెస్ నేతలు యుద్ధానికి సిద్ధమయ్యారు.. ఎలాగైనా గెలవాలని యుద్ధతంత్రాలు రచిస్తున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని పెద్ద పెద్ద ప్లాన్ లు చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో పార్టీకి పెద్దదిక్కైన సైన్యాధిపతులు చేజారిపోతున్నారనే వార్త కాంగ్రెస్ ను కలవరపెడుతోంది.. టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు వారు వలస వెళుతుండడం కాంగ్రెస్ కు పెద్ద షాకే అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇంతకీ ఎవరా నేతలు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.
నిజానికి ఇప్పుడు జంపింగ్ లు ఏమైనా జరగాలంటే.. టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జరగాలి. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికలకు వెళుతూ 105మంది సీట్లను ప్రకటించేశారు. ఇక ప్రకటించడానికి పెద్దగా సీట్లు కూడా లేవు. ఇప్పుడు ఆ పార్టీలో టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఆ అసంతృప్తులను లాగేసుకొని బలపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కారెక్కగా.. డీఎస్ - కొండా సురేఖ లాంటి బలమైన టీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి రావడానికి రెడీ అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ తమకు కలిసి వస్తుందని ఆశలు పెట్టుకుంది. పైగా మహాకూటమి ఏర్పాటుతో ఎలాగైనా టీఆర్ ఎస్ ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అవుతోందట..
కాంగ్రెస్ సీనియర్లను టీఆర్ ఎస్ టార్గెట్ చేసిందనే వార్త కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. దక్షిణ తెలంగాణలోని ఆ రెండు జిల్లాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కారెక్కేందుకు రెడీ అయ్యారట.. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ పెద్దలు వారిని బుజ్జగిస్తున్నారనే వార్త బయటకుపొక్కింది. వారే గనుక వెళితే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు పెద్ద షాకే. అదే సమయంలో ఈ ప్రాంతంలో చాలా వీక్ గా ఉన్న టీఆర్ ఎస్ అనూహ్యంగా బలపడడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఆ సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆపడానికి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారట.. కానీ వారు కారెక్కేందుకే రెడీ అయ్యారని సమాచారం. దీంతో టీఆర్ ఎస్ నుంచి వలసలను తీసుకొని గులాబీ పార్టీకి షాకిద్దామని అనుకుంటే.. ఏకంగా టీఆర్ ఎస్సే.. కాంగ్రెస్ పెద్ద తలకాయలను టార్గెట్ చేయడం కలవరపెడుతోందట..