Begin typing your search above and press return to search.
సింగరేణికీ కేసీఆర్ గాలం...
By: Tupaki Desk | 24 Aug 2018 1:30 AM GMTఎన్నికలు దగ్గరపడుతుండడంతో అన్ని వర్గాల వారిని చేరదీసుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు. కులాల వారిగా - ప్రాంతాల వారిగా - వర్గాల వారిగా అందరికీ తాయిలాలు విసురుతున్నారు. కే. చంద్రశేఖర రావు తాజగా సింగరేణి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. సింగారేణి లాభలలో 27 శాతం వాటను కార్మికులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాది 25 శాతం ప్రకటించిన కేసీఆర్ ఈ ఏడాది దానిని మరో రెండు శాతం పెంచారు. దీంతో సింగరేణి కార్మికుల పంట పండింది. మరోవైపు సింగరేణి బెల్టులో ఉన్న లక్షాలాది ఓట్లను తనవైపు తిప్పుకునే వ్యూహమూ ఫలించింది. కంటి వెలుగు - రైతు బందు - కల్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ వంటి పథకాలతో ప్రజలకు చేరువవుతున్న కేసీఆర్ సింగరేణి ఓటర్లను కూడా కొత్త తాయిలంతో తమవైపు తిప్పుకుంటున్నారు. దీంతో ఖమ్మం - కరీంనగర్ - అదిలాబాద్ జిల్లాలో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల కార్మికులు తెలంగాణ రాష్ట్ర సమితీ వైపు ఉంటారని కేసీఆర్ భావన. లాభాలలో వాటతో పాటు పిఆర్ పీ (పెర్ ఫార్ మేన్స్ రిలేటేడ్ పే) కూడా వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారి చేసారు. కార్మికులతో పాటు అధికారులను కూడా ఆకర్షించేందుకు వారికి హైదారబాదులో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు కార్మికులకు ఇస్తున్నట్లుగా అధికారులకు కూడా ఇళ్ల నిర్మాణాల కోసం వడ్డీలేని పది లక్షల రూపాయల రుణాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
సింగరేణి కార్మికులకే బయ్యారం గనుల తవ్వకాల పనిని కూడా అప్పగించాలన్న కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో దాదాపు 40 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ప్రభావం ఉంటుంది. కొన్ని చోట్ల వారే విజేతను నిర్ణయిస్తారు. రాజకీయంగా సింగరేణి ప్రాధాన్యం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు చాలా తెలుసు. దీనిని ద్రష్టిలో ఉంచుకుని సింగరేణి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాదన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. ఈ నిర్ణయాలను ప్రతిపక్షాల వ్యతిరేకించలేవు. ఒకవేళ వ్యతిరేకిస్తే దాని నష్టం వాళ్లకేనని ఆయన అభిప్రాయం. ఎన్నికల ముందు ఈ కీలక నిర్ణయం తీసుకున్న కె.చంద్రశేఖర రావు ముందు ముందు మరిన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం తెలంగాణలో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కెసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఈసారి వారికి మళ్లీ అధికారం దక్కదని అంటున్నారు.