Begin typing your search above and press return to search.
కేసీఆర్ హిట్ లిస్ట్ లో ఆ ముగ్గురు?
By: Tupaki Desk | 1 Aug 2018 4:31 PM GMT2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ ఎస్...మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ ఇచ్చినప్పటికీ.....ఇటు ఏపీలో అటు తెలంగాణలో...పట్టు కోల్పోయిన కాంగ్రెస్....తమ పార్టీకి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఏపీలో లాగా త్రిముఖపోరు లేకపోయినప్పటికీ....తెలంగాణలో కాంగ్రెస్ - టీఆర్ ఎస్ ల మధ్య ద్విముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ ఎస్ - ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా భావిస్తోన్న ముగ్గురు నేతలను గులాబీ దళపతి కేసీఆర్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో బాహబలిలాగా బలమైన ఆ ముగ్గురు నేతలకు దీటైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేత - కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి - మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి - గద్వాల్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి డీకే అరుణలను కేసీఆర్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలయిన ఆ ముగ్గురి నియోజకవర్గాలను కైవసం చేసుకుని....సొంత నియోజకవర్గాల్లోనే దెబ్బతీయాలని టీఆర్ ఎస్ సీనియర్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారట. టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై ఒంటికాలిపై లేస్తోన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పక్కలో బల్లెంలా మారిన రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు ప్లాన్స్ వేస్తున్నారట. కొడంగల్ లో టీఆర్ ఎస్ తరఫున గట్టి అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా....రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని కొడంగల్ వరకే పరిమితం చేయాలని గులాబీ అధినేత ప్లాన్ చేస్తున్నారట.
అందుకే, రేవంత్ పై మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తున్నారట. నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కూడా చెక్ పెట్టేందుకు కేసీఆర్ పథకం రచిస్తున్నారట. కోమటిరెడ్డి పై గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలో దింపాలని పావులు కదుపుతోందట. తెలంగాణ `జేజేమ్మ`గా పేరుగాంచిన డైనమిక్ వుమెన్ డీకె అరుణపై కూడా కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారట. `గద్వాల`కోటలో అరుణను దెబ్బకొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడి కోసం టీఆర్ ఎస్ అధిష్టానం అన్వేషిస్తోందట. మరి ఈ ఎత్తులు పై ఎత్తులలో ఎవరు చిత్తవుతారో తెలియాలంటే...మరి కొంతకాలం వేచి చూడాలి.