Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొత్త టార్గెట్ తో టీఆర్ ఎస్ నేతల ఉక్కిరిబిక్కిరి
By: Tupaki Desk | 12 Nov 2017 9:15 AM GMTతెలంగాణలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరువాత పరిణామాలు మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరడంతో... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ ఎస్ నేతలకు కొత్త ఆదేశం ఇచ్చారని దీంతో పార్టీ ద్వితీయ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇదంతా పార్టీలో చేరికల గురించి. ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2 గురించి. ఆకర్ష్ పర్వంలో భాగంగా మొన్నటి వరకు ఎమ్మెల్యేలు - ఎంపీల జంపింగ్ సీజన్ నడవగా - తాజాగా పార్టీ క్యాడర్ ఫిరాయింపుల జోరందుకుంది.
తెలంగాణ లో ఎన్నికలకు ఏడాదిన్నరనే ఉండడంతో రాజకీయ పార్టీలు ద్వితీయ - తృతీయస్థాయి నాయకులు - కార్యకర్తలపై కన్నేసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తరువాత డైలమాలో పడిన టీడీపీ కేడర్ ను తమ వైపు లాక్కునేందుకు అటు కాంగ్రెస్ - ఇటు టీఆర్ ఎస్ లు పోటీ పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీ ప్రధాన పార్టీల్లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో సైతం గణనీయమైన ఓట్లతో పాటు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందింది. అయితే ఓటుకు నోటు వ్యవహారం - ఆ తరువాత 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరడంతో టీడీపీ బలహీనపడింది. కాని కొంత క్యాడర్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. వారు కూడా తాజా పరిణామాలతో తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు. ఇప్పటికే 13 ఏళ్ళుగా అధికారానికి దూరమవడం - వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోవడం - తెలంగాణలో పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితికి చేరి....ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈ సారి ఒంటరి పోరాటమని స్పష్టం చేయడం, వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ల మధ్యే పోటీ క్రమంగా కేంద్రీకృతం అవుతున్న పరిస్థితులు నెలకొంటుండడంతో వారు అనివార్యంగా ఎటోవైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలా తెలంగాణ టీడీపీ నేతలు డైలమాలో పడిపోయిన నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డితో పాటు బలమైన నాయకులు తమ వైపు రావడాన్ని చూపిస్తూ, భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ పలువురు టీడీపీ కార్యకర్తలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఇటీవల కామారెడ్డి - రంగారెడ్డి జిల్లాల నుండి పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం జిల్లాలో కూడా టీడీపీ క్యాడర్ ను కాంగ్రెస్ లో చేరాలని మంతనాలు జరుపుతున్నారు. సాధారణంగా మొదటి నుండి కాంగ్రెస్ వ్యతిరేకత పునాది మీదే టీడీపీ క్యాడర్ అభివృద్ధి చెందింది. అలాంటి వారు తమ వైపు రావడం కష్టమని కాంగ్రెస్ సర్వేలో కూడా తేలింది. అదే సమయంలో మిగిలిపోయిన టీడీపీ కేడర్ గతంలో టీఆర్ ఎస్ లో చేరే అవకాశం వచ్చి నా చేరలేదు. అందుకు ఆ పార్టీ నాయకత్వంపై - ఆ పార్టీపై వ్యతిరేకతే కారణమని - దాని ఆధారంగా వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. టీడీపీతో పాటుగా టీఆర్ ఎస్ లో చేరిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ - ఇతర పార్టీల కార్యకర్తలను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఇదిలాఉండగా టీఆర్ ఎస్ పార్టీ సైతం తన ప్రణాళికలను అమల్లో పెట్టింది. ద్వితీయ స్థాయి క్యాడర్ ను ఆకర్షించడంలో దూకుడు పెంచింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగానే ముందు ఆయన నియోజకవర్గం కొడంగల్ పై కన్నేసింది. అక్కడ ఉన్న పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులను - నాయకులను టీఆర్ ఎస్ లో చేర్చుకుంది. దాంతో పాటుగా మిగతా నియోజక వర్గాల్లో కూడా టీడీపీ క్యాడర్ ను వీలైనంత ఎక్కువ మందిని చేర్చుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ నాయకులను ఆదేశించారు. ఇరు పార్టీల నుండి నజర్ తమవైపు మళ్ళడంతో పలు చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు పండుగ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా కొంత మంది తమ ఆర్థిక పరమైన అవసరాలకు చేరికలను అవకాశాలుగా తీసుకుంటున్నారు. ఇటీవల పార్టీలు మారిన వారిలో కొందరికి రూ.50 లక్షల నుండి రూ. కోటి వరకు చేతులు మారినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇటు అధికార పార్టీ - అటు ప్రధాన ప్రతిపక్షం వల వేస్తుండటంతో ద్వితీయ శ్రేణి నేతలకు పండుగలా మారింది. అదే సమయంలో పార్టీ ఇచ్చిన `టార్గెట్`ను పూర్తి చేయడం టీఆర్ ఎస్ శ్రేణులకు తలనొప్పిగా మారిందని అంటున్నారు.