Begin typing your search above and press return to search.

కేసీఆర్ సిద్ధాంతం.. బీజేపీపై జగన్ ప్లాన్ ఇదే

By:  Tupaki Desk   |   6 Nov 2019 8:20 AM GMT
కేసీఆర్ సిద్ధాంతం.. బీజేపీపై జగన్ ప్లాన్ ఇదే
X
‘అక్క మొగుడే కదా అని మొహమాటపడితే కడుపు అయ్యిందన్న సామెత’ ఎంతో పాపులర్. ఈ సామెతకు అర్థంవచ్చేలా మొహమాటానికి పోయే కర్ణాటక, గోవాలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అధికారాన్ని అప్పగించిదన్నది తెలిసిందే.. కానీ బీజేపీ ఎత్తులు తెలంగాణలో పారలేదు. కేసీఆర్ లాంటి రాజకీయ చతురత కలిగిన నేత పోయిన ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ కొట్టిన వైనాన్ని బీజేపీ నేతలు ఇప్పటికీ మరిచిపోరరట.. అందుకే కేసీఆర్ ను నమ్మనే నమ్మం అని బీజేపీ పెద్దలు చెబుతుంటారు.

పోయిన 2018లో తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ అండదండలతోనే కేసీఆర్ పెట్టుకున్నారు. 2014లో గద్దెనెక్కిన కేసీఆర్ కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీతో ఫ్రెండ్ షిప్ చేసి ఆయన ప్రతీ నిర్ణయాన్ని సమర్థించి మద్దతు పలుకుతూ వచ్చారు. అందుకే 2018లో మోడీని ఒప్పించే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన 5 సీట్లకు మాత్రం ప్రకటించకుండా చివరి నిమిషం వరకూ బీజేపీకి ఫేవర్ గా ఉంటూ వచ్చారు. కానీ చివరి రోజు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై బలమైన టీఆర్ఎస్ అభ్యర్థులను దింపి బీజేపీ సీట్లను 5 నుంచి 1కి తగ్గించారు. బీజేపీని తెలంగాణలో చావు దెబ్బ కొట్టారు. నమ్మించి మోసం చేశారని రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్ పై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారట..

కానీ కేసీఆర్ బీజేపీతో కేవలం ఢిల్లీలోనే దోస్తీ అని.. తెలంగాణ గల్లీలో తనకు బీజేపీ శత్రువేనని స్పష్టం చేశారు. ఇప్పటికీ అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉంటూ రాష్ట్రంలో మాత్రం బీజేపీని అణగదొక్కే ప్రయత్నాలను కేసీఆర్ చేస్తూనే ఉంటున్నారు.

తాజాగా ఇదే కేసీఆర్ ఫార్ములాను అనుసరించాలని ఏపీ సీఎం జగన్ యోచిస్తున్నారట.. ఇప్పటికే టీడీపీపై ఆ పార్టీ నేతల్లో నమ్మకం సడలిన వేళ వారందరినీ వైసీపీలోకి ఆకర్షిస్తున్న జగన్ ఇప్పుడు తనకు కొరకరాని కొయ్యలుగా మారిన బీజేపీ నేతలు కన్నా, సుజన, సీఎం రమేష్ లాంటి వారిని దెబ్బకొట్టే ప్రయత్నాలకు తెరతీసినట్టు సమాచారం..

ఓ వైపు జగన్ ఢిల్లీలో మోడీషాలతో సాన్నిహిత్యం నెరుపుతూ రాష్ట్రానికి నిధులు తీసుకువస్తున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలతో మాత్రం కయ్యానికే కాలుదువ్వడానికి రెడీ అవుతున్నారట.. కేంద్రం వేరు, రాష్ట్రంలో వేరు అని జగన్ బీజేపీ విషయంలో డబుల్ స్టాండ్ తీసుకోబోతున్నట్టు తెలిసింది. త్వరలోనే బీజేపీ నేతల దూకుడు వైసీపీ అధినేత జగన్ కళ్లెం వేయబోతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.