Begin typing your search above and press return to search.
అగ్రవర్ణాలకు రిజర్వేషన్..కేసీఆర్ కొత్త అస్త్రం
By: Tupaki Desk | 30 Jun 2018 4:47 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అదినేత కేసీఆర్ ఎన్నికల వ్యూహాలకు శరవేగంగా పదునుపెడుతున్నారు. ఓవైపు ముందస్తుకు సిద్ధం అవుతూనే మరోవైపు ఒకవేళ - సార్వత్రిక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వచ్చినా ఎదుర్కునేందుకు దూరదృష్టితో కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. తాజాగా కేసీఆర్ కన్ను అగ్రవర్ణాలపై పడింది. ఇందులో భాగంగా కీలక ఆర్థిక ప్రయోజనాలు కలిగించేందుకు కసరత్తు చేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ - సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ పార్టీలో చేరడం వీరికి రాష్ట్ర ఐటీ - పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు - ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ - పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం...ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమంటున్నారు.
పేదవారు ఎక్కడున్నా పేదవారేనని - అగ్రవర్ణాల్లో కూడా అనేకమంది పేదవారు ఉన్నారని రాష్ట్ర ఐటీ - పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలోనే మంచి నిర్ణయాన్ని - కార్యాచరణను ప్రకటించనున్నారని చెప్పారు. ఆర్యవైశ్యులు కోరిన విధంగా యాదాద్రి - హైదరాబాద్ లో సేవాకార్యక్రమాలకు సంబంధించి సీఎం కేసీఆర్ తో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. భూకేటాయింపుపై సానుకూలంగా స్పందిస్తామన్నారు. ఆర్యవైశ్యులకు నామినెటెడ్ - ఇతర పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో సీట్ల అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ - బీజేపీ నాయకులు నయా నయవంచక మాటలతో వస్తారని, వారందరిపట్ల జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు. ఏదో ఏదో చెప్తారని, ఆకాశంలోని చందమామను కూడా తెచ్చి ఇస్తామని చెప్తారని అన్నారు. ద్రోహచరిత్ర కాంగ్రెస్ ది.. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన కేటీఆర్ సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు.
కాగా, అగ్రవర్ణాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పలు పథకాలు ఉన్నాయని తెలుస్తోంది. టీఆర్ ఎస్ ఓటు బ్యాంక్ స్కీంలలో ఒకటైన కల్యాణలక్ష్మి పథకాన్ని అగ్రవర్ణాల్లోని పేదవారికి వర్తింపచేయడంతో పాటుగా ఆర్థిక స్థితిగతులతో సబంధం లేకుండా కుటుంబంలో ఒక్క వివాహం వరకు ఒక్కరికి అందించేలా చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటుగా ఎస్సీ - ఎస్టీ - బీసీల వలే అగ్రవర్ణాలలోని పేదలకు సైతం రుణాల మంజూరికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థూలంగా కీలకమైన అగ్రవర్ణ ఓటర్లను ఆకట్టుకునే ఎత్తుగడలను కేసీఆర్ సిద్ధం చేసి పెట్టారని పేర్కొంటున్నారు.