Begin typing your search above and press return to search.
రాజులు - రాజ్యాలు పోయాయి..కేసీఆర్ వచ్చాడు..
By: Tupaki Desk | 29 May 2018 4:29 AM GMTజనాలకు సర్ ప్రైజ్ ఇవ్వడంలో కేసీఆర్ ది అందెవేసిన చేయి.. ఎక్కడ ఎలా ఆకట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు.. పూర్వం రాజుల కాలంలో ఏదైనా పండుగొచ్చినా.. పబ్బంవచ్చినా రాజులు జనాలకు కానుకలు ఇచ్చేవారు.. దాంతో వారంతా పండుగ పూట వచ్చిన ఆ కానుకలతో రాజులపై అమితమైన ప్రేమను కనబరిచేవారు.. పండుగ కాబట్టి అంతా ఖాళీగా ఉంటారు.. రాజుగారు ఇచ్చిన కానుకలపై చర్చ జరిగేది.. మొత్తంగా రాజు గారు గొప్పవారు అంటూ కీర్తించేవారు. అలాంటి రాజులకాలం నాటి స్ట్రాటజీని కేసీఆర్ చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నారు. ఆయన కొత్త పథకాలను ప్రవేశపెట్టే తీరు చూసినా.. ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా దానికి పండుగలను బేస్ చేసుకోవడం కేసీఆర్ కు అలవాటు.
*దసరా - దీపావళి కానుకలు..
కేసీఆర్ గడిచిన దసరా పండుగకు తెలంగాణ ఆడపడుచులకు చేనేతలు నేసిన చీరలను బహుమతిగా అందించారు. చీరల కోసం ధనిక - పేద అనే తేడా లేకుండా చాలా మంది ఎగబడ్డారు. పండుగ ముందు వచ్చిన ఈ కానుక తెలంగాణలో చర్చకు దారితీసింది. అన్నింటికంటే చీరలంటే ప్రాణమిచ్చే మహిళా లోకం కేసీఆర్ ఇచ్చిన చీరలకు ఫిదా అయ్యారు. ఇక దసరా కానుకగా ఉద్యోగులకు ఫిట్ మెంట్ - డీఏ పెంపులు చేస్తుంటాడు కేసీఆర్.. ఇక ఇటీవలే తెలంగాణ రైతులకు ఎకరానికి 4 వేల పెట్టుబడి సాయాన్ని కూడా ఉగాది పండుగకు దగ్గర్లో ప్రకటించి రైతన్నలను ఖుషీ చేశాడు. ఇలా పండుగలను బేస్ చేసుకొని కేసీఆర్ పథకాలను ప్రకటిస్తుంటారు..
*జూన్ 2న ఉద్యోగాల మేళా..
జూన్ 2.. తెలంగాణకే పెద్ద పండుగ.. తెలంగాణ అవతరణ దినోత్సవం. ఈ రోజున గొప్పగా నిర్వహించడానికి.. విద్యార్థులందరూ పాల్గొనేలా చేయడానికి పాఠశాలలన్నింటిని జూన్ 1 నుంచే ప్రారంభింపచేస్తున్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 12న ప్రారంభమయ్యే పాఠశాలలు ఇప్పుడు తెలంగాణ అవతరణ దినం కోసం 10 రోజుల ముందే ప్రారంభమవుతున్నాయి. ఈ జూన్2న ప్రభుత్వం నిరుద్యోగులకు గొప్పకానుక అందుతోంది. చకోర పక్షిలా ఉద్యోగాల కోసం చూస్తున్న వారికోసం గ్రూప్ 4 - వీఆర్వో ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వబోతోంది. ఇవన్నీ క్షేత్రస్థాయి పోస్టులు. ఇంటర్ అర్హత గల ఉద్యోగాలు.. దీంతో సహజంగానే తెలంగాణలోని ప్రతి నిరుద్యోగి దీనిపై ఆసక్తి చూపిస్తారు. జూన్ 2న రాష్ట్ర పండుగనాడు కేసీఆర్ ప్రకటిస్తుండడంతో అందరూ సంతోషంగా ఉన్నారు..
ఇలా ప్రతి పండుగకు ప్రజలను సంతోషపెట్టే వార్తనొకటి మోసుకొస్తున్నారు కేసీఆర్.. పండుగల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. రాజుల కాలం నాటి ఐడియా అయినా సరే.. ఎంత బలంగా వెళ్లిందనేదే కేసీఆర్ కు ముఖ్యం.. ఇందుకే కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా అంతలా చర్చకు దారితీస్తున్నాయి..