Begin typing your search above and press return to search.

సేమ్ ఫార్ములాను అప్లై చేస్తున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   30 Oct 2016 5:30 PM GMT
సేమ్ ఫార్ములాను అప్లై చేస్తున్న కేసీఆర్‌
X
ఏదైనా భారీగా ఉండేలా నిర్ణ‌యం తీసుకునే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అదే ఫార్ములాను త‌న పార్టీ విష‌యంలో అమ‌లు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీఆర్‌ ఎస్ పార్టీపై దృష్టిపెట్టిన కేసీఆర్ ఈ క్ర‌మంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. పార్టీ స‌త్తాను చాటేందుకు గాను డిసెంబర్‌ లో భారీ బహిరంగ సభ నిర్వహించాల‌ని కేసీఆర్ డిసైడ్ చేశారు. నవంబర్‌లో పార్టీ జిల్లాల కమిటీలను నియమించిన తర్వాత కేసీఆర్‌ జిల్లాల యాత్ర చేపడతారని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్‌ లో బహిరంగ సభ నిర్వహించి - ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించనున్నారు. బహిరంగ సభ తేదీని నవంబర్‌ లో ప్రకటించనున్నారు.

మ‌రోవైపు మూడువేల‌కు పైగా పార్టీ ప‌ద‌వుల‌ను నాయ‌కుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారు. టీఆర్‌ ఎస్ పార్టీ జిల్లాల కమిటీలను ఖరారు చేసిన కేసీఆర్ ఒక్కో జిల్లా కమిటీని 115 మందితో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 31 జిల్లాల్లో 3565 మందికి పార్టీ పదవులను టీఆర్‌ ఎస్‌ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పగించబోతున్నారు. దీనికి సంబంధించి నవంబర్‌ నాలుగు - ఐదు తేదీల్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ నూతన కమిటీలతో సమావేశమై ప్రభుత్వ పథకాలను వివరిస్తారని టీఆర్‌ ఎస్‌ వర్గాలు అంటున్నాయి. గతంలో పది జిల్లాలకు అధ్యక్షులను నియమించగా...ప్రస్తుతం 31 జిల్లాలు ఉండటంతో మిగతా 21 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారు. పాత వారిని మార్చకుండా, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కుల సమీకరణలు ఆధారంగా అధ్యక్షులను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. మహిళలకు కూడా అధ్యక్ష పదవులను కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. పార్టీ జిల్లాల కమిటీలపైనే రెండురోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా జిల్లాల నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు జిల్లాల తప్ప దాదాపు అన్ని జిల్లాలకు అధ్యక్షు లను ఖరారు చేసినట్టు తెలిసింది. ఎవరెవరిని నియమించబోతున్నట్టు కూడా జిల్లా లకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఒక్కో జిల్లాలో అధ్యక్షుడితో పాటు 20 మంది కార్యదర్శులు - ఉపాధ్యక్షులు - 94 మందిని సభ్యులుగా నియమిం చబోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/