Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అప్పీల్ చేయ‌బోతున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   14 March 2019 4:19 AM GMT
త్వ‌ర‌లో ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అప్పీల్ చేయ‌బోతున్నార‌ట‌!
X
టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు. గ‌డిచిన కొంత‌కాలంగా నోరు విప్ప‌ని టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక అప్పీల్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కేసీఆర్ చేసే అప్పీల్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కాదు.. ఏపీ ప్ర‌జ‌ల‌కని చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

ఏపీ ఎన్నిక‌ల్లో ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌లు తెలివైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేసీఆర్ అప్పీల్ చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గంద‌ర‌గోళ‌ప‌డుతున్నార‌ని.. తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ జీవితం ముగియ‌నున్న‌ట్లు జోస్యం చెప్పారు.

చంద్ర‌బాబును రాజ‌కీయాల నుంచి వీడ్కోలు ప‌లికేందుకు ఏపీ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు కేటీఆర్ చెప్పారు. తాజాగా ఒక ప్ర‌ముఖ వార్తా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప‌ని చేస్తున్న‌ త‌మ పార్టీ ఏపీలో అడుగుపెట్టాల‌ని తాము అనుకోవ‌టం లేద‌న్నారు.

తాజాగా ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌లు చంద్ర‌బాబు వ‌ర్సెస్ కేసీఆర్ అన్న‌ట్లుగా చిత్రీక‌రించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న తీరు విచిత్రంగా ఉంద‌న్న ఆయ‌న‌.. ఏపీలో ఒక్క చోట కూడా టీఆర్ ఎస్ పార్టీ కార్యాల‌యం లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. ఏపీలో ఎవ‌రో ఒక‌రి అవ‌కాశాల్ని తాము ప్ర‌భావితం చేస్తామ‌ని చెప్ప‌టంలో అర్థం లేద‌న్నారు.

ఏపీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ప్ర‌మేయం ఏమీ ఉండ‌ద‌ని.. తాము జోక్యం చేసుకోమ‌న్న‌ట్లుగా చెబుతున్న కేటీఆర్.. మ‌రోవైపు ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయ‌న్న విష‌యాన్ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఏపీ ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితం రాబోతుంద‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంద‌న్న ఆయ‌న‌.. ఏపీ ప్ర‌జ‌లు బాబును గ‌ద్దె దించ‌టానికి సిద్ధంగా ఉన్నార‌ని.. ఏపీ ప్ర‌జ‌లు తెలివైన నిర్ణ‌యం తీసుకునేలా చూడాల‌ని తాము అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఈ కార‌ణంతోనే ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం తాము అక్క‌డి ఓట‌ర్లను ఉద్దేశించి ఒక అభ్య‌ర్థ‌న చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. అయితే.. ఈ అభ్య‌ర్థన ఎప్పుడు చేయాల‌న్న‌ది త‌మ ముఖ్య‌మంత్రి డిసైడ్ చేస్తార‌ని కేటీఆర్ చెప్పారు. మ‌రి.. ఆ అప్పీల్ ఎప్పుడు ఉంటుందోన‌న్న కొత్త ఆస‌క్తిని కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌తో తెచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.