Begin typing your search above and press return to search.
ఏరు దాటాక ఓడ కేసీఆర్
By: Tupaki Desk | 9 Aug 2015 11:51 AM GMTఏరు దాటేదాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అని తెలుగులో సామెత. ఈ సామెత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అచ్చు గుద్దినట్లు సరిపోతుందని తెలంగాణ వాదులే వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యమ కాలంలో గొంగళి పురుగును కూడా అక్కున చేర్చుకున్న ఆయన.. ఇప్పుడు సీతాకోక చిలుకను కూడా దూరం పెడుతున్నారని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది జేఏసీ. దాని చైర్మన్ కోదండరాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జే ఏసీని, కోదండరామ్ ను కేసీఆర్ దూరం పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నైనాల గోవర్ధన్ వంటి పలువురు సామాజిక ఉద్యమకారులు, సంఘాల నేతలు. తెలంగాణ వచ్చిన తర్వాత వారిని కూడా కేసీఆర్ దూరం పెట్టారు. నోరున్న అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి వంటి వారికి పదవులు ఇచ్చి నోరు మూసేశారు. మిగిలిన వాళ్లను అధికారంతో తొక్కేస్తున్నారని తెలంగాణ వాదులే వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా సమ్మెలు ఆందోళనలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఉద్యమ కాలంలో తెలంగాణలో ప్రతిరోజూ సమ్మె జరిగిందని, విద్యార్థులు ఎన్నో పని దినాలను కోల్పోయారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఉద్యమం కారణంగానే ఇక్కడి విద్యార్థులు సీమాంధ్రకు వలస వెళ్లిపోయారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో పంచాయతీ కార్మికుల నుంచి పారిశుద్ద్య కార్మికుల వరకూ ఎవరు ఆందోళన చేసినా, ఎవరు ధర్నా చేసినా టీఆర్ ఎస్ మద్దతు ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు కనక వామపక్షాలు చేసే ఉద్యమాలు పనికిమాలిన, దిక్కు మాలిన ఉద్యమాలు అయిపోయాయా అని నిలదీస్తున్నారు. ఉద్యమనాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిపోయానని ప్రకటించుకున్న కేసీఆర్.. నిజంగానే ఫక్తు రాజకీయ నాయకుడు అయ్యారని అంటున్నారు.