Begin typing your search above and press return to search.
కేటీఆర్ అవుట్.. కేసీఆర్ ఇన్
By: Tupaki Desk | 16 Oct 2019 4:08 AM GMTఆర్నెల్ల తేడాలో జరిగిన అసెంబ్లీ - లోక్ సభ ఎన్నికల్లో పూర్తిగా భిన్నమైన ఫలితాలు చవిచూసిన టీఆరెస్ పార్టీ ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు గెలిచిన స్థానం కావడంతో దాన్నే కొల్లగొట్టి తమకు తిరుగులేదని చాటుకోవాలని టీఆరెస్ తపిస్తోంది. అయితే, అనూహ్యంగా ఆర్టీసీ సమ్మె ఆ పార్టీ ఆశలకు బ్రేకులేసింది. కొద్దిరోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె - సుమారు 49 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు డోలాయమానంలో పడడం.. కేసీఆర్ దీనిపై మొండిపట్టుదలకు వెళ్లడం వంటి కారణాలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ పరిస్థితుల్లో హుజూర్ నగర్లో ప్రచారానికి వెళ్లడానికి టీఆరెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పుకోవాలో తెలియదు కాబట్టి హుజూర్ నగర్ వైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదట. చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హుజూర్ నగర్ ప్రచారాన్ని చాలించాలనుకుంటున్నారట. ఆయన అక్కడి వ్యవహారం నుంచి పూర్తిగా బయటకొచ్చేస్తుండగా సీఎం కేసీఆరే ఇప్పుడు ప్రచారానికి వెళ్లనున్నారు.
కేసీఆర్ గురువారం హుజూర్ నగర్లో ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తొలుత 18వ తేదీన ఆయన ప్రచారానికి వెళ్తారని అనుకున్నా దాన్ని ఒక రోజు ముందుకు జరిపారు. అక్కడ కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దానికోసం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభతోనే ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందో అర్థమైపోతుందని.. టీఆరెస్ విజయానికి ఈ సభే తొలి మెట్టని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అయితే, ఆర్టీసీ సమ్మె విషయంలోనే పార్టీ నేతలు కాస్త టెన్షన్ పడుతున్నారట. ఈ సమ్మె కారణంగానే తొలుత మద్దతు ప్రకటించిన సీపీఐ తరువాత మద్దతు ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ - టీడీపీ - బీజేపీలు కూడా ప్రధానంగా ఈ అంశాన్నే ప్రచారంలో వాడుతున్నాయి. దీంతో ఆర్టీసీ సమ్మె వల్ల కలిగిన నష్టాన్ని కేసీఆర్ ఎలా కవర్ చేసుకుంటారా అన్నది అందరిలో ఆసక్తి పెంచుతోంది.