Begin typing your search above and press return to search.

కెసిఆర్ కోసం సమరసీమ కూడా రెడీ

By:  Tupaki Desk   |   10 March 2018 10:51 AM GMT
కెసిఆర్ కోసం సమరసీమ కూడా రెడీ
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద ప్రత్యేకించి మోడీ విధానాలమీద - సమరం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రంలో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న పార్టీల పీచమణచడానికి - దేశంలో మూడో రాజకీయ కూటమి ని తయారు చేయబోతున్నట్లు గా కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ప్రకటనకు దేశవ్యాప్తంగా అనేక మంది నాయకుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పోరాటాన్ని ఎక్కడినుంచి ప్రారంభించబోతున్నారు? ఆయన తన సమర క్షేత్రాన్ని ఎంపిక చేసుకున్నారా? అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహాలు

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎంపీగా పోటీ చేయడానికి తన నియోజకవర్గాన్ని ఖరారు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా తనను ఎంతగానో ఆదరించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే కేసీఆర్ ఈసారి కూడా తొడ కొడతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయ వర్గాలలో ఈ విషయమై చర్చ జరుగుతోంది.

గతంలో కూడా కెసిఆర్ ను కరీంనగర్ నియోజకవర్గం పలుమార్లు గెలిపించింది. 2004 ఎన్నికలలో ఇక్కడి నుంచి బరి లోకి దిగిన కెసిఆర్ కాంగ్రెస్ పొత్తు తో ఒక లక్ష 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2006 - 2008 సంవత్సరాల్లో కూడా కరీంనగర్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 2006లో కాంగ్రెస్ పొత్తు లేకుండానే మరింత ఎక్కువ మెజారిటీ సాధించడం కూడా విశేషం. ఆరోగ్యంగా తనను ఇప్పటికే మూడుసార్లు సమాదరించిన కరీంనగర్ ఎంపి నియోజకవర్గం నుంచి కేసీఆర్ 2009లో మళ్లీ బరిలోకి దిగి - హస్తినలో చక్రం తిప్పాలని సంకల్పిస్తూ ఉండడం గమనార్హం.

కెసిఆర్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అనే విషయమై మరికొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వీలయితే రంగారెడ్డి లేదా నల్గొండ ఎంపి నియోజక వర్గాలను కూడా ఆయన ఎంపిక చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. నల్గొండలో కాంగ్రెస్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉన్నది గనుక, కెసిఆర్ బరిలోకి దిగితే జిల్లా అంతా కూడా తెరాసకు ఎడ్వాంటేజీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నల్గొండ రోగికి ఎలాంటి ఛాయిస్ తీసుకోవడానికి కెసిఆర్ ఇష్టపడక పోవచ్చు అని కూడా కొందరు అంటున్నారు. దానికి కేసీఆర్ ఎంచుకునే సమర క్షేత్రం ఏమిటో మరి కొన్ని వారాల వ్యవధిలోనే స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.