Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఎంపీగా ఎక్కడినుంచి పోటీ అంటే..
By: Tupaki Desk | 5 March 2018 8:38 AM GMTజాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పుతాను.. తృతీయ కూటమికి నాయకత్వం వహిస్తానని తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడం అన్నివర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర - బీజేపీయేతర కూటమికి అంకురార్పణ చేశారు. మరోసారి ఉద్యమనేతగా ఆవిర్భవించబోతున్నారు. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కావాలని ఆయన నినదిస్తున్నారు. ఇందుకు ఆయన అమెరికాను ఉదహరిస్తున్నారు. అలాగే నదీ జలాల సమస్య.. దశాబ్దాలు గడిచినా రాష్ట్రా ల మధ్య జల వివాదాలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించ కుండా ఢిల్లీలో కూచుని తమాషా చూస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఆలోచనలన్నీ సంచలనాత్మకంగా ఉన్నాయని ఇప్పటికే వివిధ వర్గాల నుంచి అందుతున్న మద్దతుని బట్టి అర్థమవుతోంది. ఈ ప్రకారం ఆయన ఎంపీగా పోటీచేయవచ్చని ప్రచారం జరుగుతోంది.
అయితే గులాబీ దళపతి కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఈ ఎత్తుగడలో కూడా తనదైన మార్కు రాజకీయ వ్యూహాలను అమల్లో పెడతారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దేశంలో గుణాత్మక మార్పును ప్రజలు కోరుకుంటున్నారు.. తృతీయ కూటమికి నాయకత్వం వహిస్తా.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పుతా అని ప్రకటించిన నేపథ్యంలో నల్గొండ పార్లమెంట్ బరిలో నిలిచే వ్యూహంలో కేసీఆర్ ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్ పినేత జానారెడ్డి - సీఎల్ పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఎమ్మెల్సీ - మాజీ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి ముఖ్య నేతలంతా ఉమ్మడి నల్గొండలోనే ఉన్నారు. ఈ నేపధ్యంలో నల్గొండ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా పోటీచేస్తే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపవచ్చుననే ఆలోచనతో ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు గురి పెట్టినట్లు తెలుస్తుంది.
ఇందుకు తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు కూడా నిదర్శనమని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించిన వెంటనే నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు కలిసికట్టుగా ప్రగతిభవన్ లో స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో జిల్లా ముఖ్యులంతా భేటీ అయ్యి రాజకీయాలపై చర్చించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలంటే బలంగా ఉన్న నల్గొండ నుంచే పార్లమెంట్ కు పోటీ చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్తున్నట్లు బడ్జెట్ సమావేశాల తర్వాత నల్గొండ పర్యటన రెండు రోజులపాటు ఏర్పాటు చేసుకొని అన్ని అంశాలపై అక్కడే పరిష్కార మార్గాలు చూపుదామని చెప్పినట్లు సమాచారం. స్థూలంగా జాతీయ రాజకీయాల ఎంట్రీ సందర్భంగానే విపక్షాలకు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.