Begin typing your search above and press return to search.
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కేసీఆర్ మారిపోయారు..
By: Tupaki Desk | 4 Sep 2019 4:41 AM GMT‘కంట బడ్డావా కనికరిస్తానేమో.. వెంటబడ్డావా వేసేస్తాను ఓబా..’ ఇదీ ఇటీవల ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’లోని పవర్ ఫుల్ డైలాగ్.. రాసింది త్రివిక్రమ్ అయినా ఇప్పుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అందరూ అప్లై చేస్తారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెబుతుంటారు. నాడు ఆలె నరేంద్ర నుంచి ఆ తర్వాత టీఆర్ఎస్ లో ఎదిగిన విజయశాంతి వరకు నంబర్ 2 పొజిషన్ లో ఉన్న వాళ్ల అసమ్మతి సెగ తగలగానే ఆటోమేటిక్ గా వారిని సాగనంపే కార్యక్రమాలు పార్టీలో జరిగిపోయాయి.
మొన్నటికి మొన్న టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాశ్ ఇంటర్ ఆత్మహత్యలపై ప్రత్యేక డిబేట్లు, చర్చలు, గంటల గంటల ప్రోగ్రాంలను రూపొందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారన్న ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమైందట... ఆ తర్వాత రవిప్రకాష్ పరిస్థితి ఏమయ్యిందో అందరూ చూశాం.
తనపై, పార్టీపై ఎవ్వరూ ఎదురు తిరిగినా వారిపై అష్టదిగ్భంధనం చేసి వారిని డిఫెన్స్ లో పడేసే కేసీఆర్.. తాజాగా పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. కేసీఆరే పిలిచి పంచాయతీ పెట్టిన తీరు చూశాక.. కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరించారని చెప్పకతప్పదు. మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరాక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా ఆయన పోయేదాక చూశారు తప్పితే కేసీఆర్ పిలిచి మాట్లాడలేదు. ఇలా పంచాయతీలు పెట్టడం కేసీఆర్ కు నచ్చదంటారు. ఎదురుతిరిగిన వాళ్లను వ్యూహాత్మకంగా సాగనంపడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ తాజాగా బుజ్జగింపులు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనంతటికి బలంగా దూసుకువస్తున్న బీజేపీ ప్రభావమే కారణం అంటారు రాజకీయ విశ్లేషకులు..
తాజాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిల మధ్య గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్యేలంతా కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో జట్టుకట్టి ఇటీవల జిల్లా పరిషత్ సమావేశాన్ని బహిష్కరించారు. మంత్రిపై తిరుగుబావుట ఎగురవేశారు. మంత్రినెవరు కలవడం లేదు. కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణాను అటవీ అధికారులపై దాడి కేసులో మంత్రి అల్లోల హ్యాండ్ ఉందన్నది కోనప్ప వాదన.. కేసీఆర్ కూడా మంత్రి అల్లోలకే సపోర్ట్ చేయడంతో కోనప్ప వర్గం రగిలిపోయిందట.. ఈ కారణంతోనే అల్లోలకు వ్యతిరేకంగా కోనప్ప ఎమ్మెల్యేలను కూడగట్టారు. దీంతో రెండుగా చీలిన ఆదిలాబాద్ టీఆర్ఎస్ ను తాజాగా కేసీఆర్ సరిదిద్దారు. స్వయంగా మంత్రి అల్లోల, కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ప్రగతి భవన్ కు పిలిపించి బుజ్జగించడం విశేషం. చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ లో అదీ కేసీఆర్ బుజ్జగించి పార్టీ కోసం కలిసి పనిచేయాలని కోరిన వైనం టీఆర్ఎస్ లో ఆసక్తి రేపుతోంది.
ఎక్కడా తగ్గని కేసీఆర్ తాజాగా కోనేరు కోనప్ప తిరుగుబాటు విషయంలో వెనక్కి తగ్గడం .. బుజ్జగింపుల పర్వం టీఆర్ఎస్ ముఖ్యులనే ఆశ్చర్యపరుస్తోంది. పొంచి ఉన్న బీజేపీ ముప్పు వల్లే కేసీఆర్ వెనక్కి తగ్గారన్న చర్చ కూడా సాగుతోంది. వీరిని అలానే వదిలేస్తే బీజేపీలో చేరి ఏకుమేకు అవుతారనే భయంతోనే కేసీఆర్ తన సహజశైలికి భిన్నంగా బుజ్జగించారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.