Begin typing your search above and press return to search.
విలీనాన్ని ఈ వారంలో పూర్తి చేస్తారట!
By: Tupaki Desk | 6 Jun 2019 6:06 AM GMTఆటలో ప్రత్యర్థులు ఉంటే ఆ మజానే వేరు. కానీ.. తాజా రాజకీయాల్లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఇప్పుడు నెలకొంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై కొత్త చర్చ మొదలైంది. ఉద్యమాలు చేసి పోరాడి సాధించుకున్న తెలంగాణలో విపక్షమే ఉండకూడదన్నట్లుగా కేసీఆర్ ఆలోచనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ గులాబా బాస్ వెనక్కి తగ్గట్లేదు.
టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలనుకోవటం మంచి సంప్రదాయం కాదని.. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచిది కాదంటున్నారు. చేతిలో ఉన్న పవర్ తో ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించటం భవిష్యత్తులో దుష్ట సంప్రదాయంగా మారే ప్రమాదం ఉందంటున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. పలు పార్టీల్ని అసెంబ్లీలో విలీనం చేసిన కేసీఆర్.. తాజాగా కాంగ్రెస్ ను కూడా చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతారు. ఈ కారణంతోనే పలువురు తప్పు పడుతున్నప్పటికీ తన ప్లానింగ్ ను ఆపట్లేదని చెప్పాలి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో చోటు చేసుకునే పరిణామాలతో కాంగ్రెస్ విలీన కార్యక్రమాన్ని కాస్త ఆపినట్లుగా కనిపించింది. తాజాగా విలీన వ్యవహారానికి మళ్లీ తెర తీసినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే చోటు చేసుకుంటున్న పరిణామాలున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అసెంబ్లీలో ఏదైనా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల సభ్యులు అధికార పార్టీలో కానీ.. మరే పార్టీలో కానీ విలీనం కావాలనుకుంటే దానికి చట్టబద్థత లభిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో మూడొంతుల్లో రెండొంతులు అంటే 13 మంది సభ్యులు అవసరం. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు గులాబీ కారులోకి ఎక్కేందుకు రెఢీ అయిపోయారు. అవసరమైతే తమ ఎమ్మెల్యేల పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. అయితే.. అలాంటి అవసరం లేకుండా విలీన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు
ఇదిలా ఉంటే.. విలీనానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరమైన వేళ.. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నఉత్తమ్ కుమార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో.. కాంగ్రెస్ విలీనానికి అవసరమైన ఎమ్మెల్యే సంఖ్య12కు తగ్గింది. అంటే.. గులాబీ పార్టీలో చేరేందుకుసిద్ధంగా ఉన్న 11 మందికి మరో ఒక్కరు తోడైతే.. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి గల్లంతయ్యే పరిస్థితి. ఇప్పుడు ఆ ఒక్కడికి సంబంధించిన గులాబా బాస్ ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే.. వారం వ్యవధిలోనే టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ విలీన కార్యక్రమం సంపూర్ణం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న జెడ్పీ ఛైర్ పర్సన్ల ఎన్నిక జరగనుంది. అది పూర్తి అయిన వెంటనే.. టీ అసెంబ్లీలో కాంగ్రెస్ విలీన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తోంది.
టీఆర్ ఎస్ లో కాంగ్రెస్ విలీనానికి సహకరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూస్తే..
01. సబితారెడ్డి(మహేశ్వరం)
02. జాజాల సురేందర్(ఎల్లారెడ్డి)
03. రేగ కాంతారావు(పినపాక)
04. కందాల ఉపేందర్ రెడ్డి(పాలేరు)
05. హరిప్రియ(ఇల్లందు)
06. వనమా వెంకటేశ్వర్ రావు(కొత్తగూడెం)
07. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్)
08. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(ఎల్బీనగర్)
09. ఆత్రం సక్కు (ఆసిఫాబాద్)
10. హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్)
11. గండ్ర వెంకటరమణారెడ్డి(భూపాలపల్లి)