Begin typing your search above and press return to search.

నెక్ట్స్ కవితేనా? కేసీఆర్ మదిలో ఆలోచన.?

By:  Tupaki Desk   |   22 Aug 2019 11:32 AM IST
నెక్ట్స్ కవితేనా? కేసీఆర్ మదిలో ఆలోచన.?
X
కేసీఆర్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. జితేందర్ రెడ్డిని సాగనంపి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా తన అనుయాయుడు వినోద్ ను నియమించి ఢిల్లీలో చక్రం తిప్పుదామని కేసీఆర్ ఊహించాడు. సరే వినోద్ ఓడిపోయాడు. కవిత గెలిచినా పార్లమెంటరీ నేతగా ఉండేది. కానీ ఇద్దరూ ఓడిపోవడంతో టీడీపీ నుంచి వచ్చి చేరి ఖమ్మం ఎంపీగా గెలిచిన నామాకు టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిన దుస్థితి గులాబీ పార్టీలో ఏర్పడింది.

అయితే ఉద్యమకాలం నుంచి తన వెంట ఉన్న వినోద్ కుమార్ కు తాజాగా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా నియమించుకున్నారు కేసీఆర్.ఆయనకు సరైన గుర్తింపును ఇచ్చారు. వినోద్ కరీంనగర్ ఎంపీగా ఓడిపోవడంతో చిన్నబుచ్చుకోకుండా ఈ పదవిని కట్టబెట్టాడు.

ఈ క్రమంలో కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ లో ఓడిన కవితకు కూడా కేసీఆర్ ఓ కొత్త పదవిని ఇవ్వబోతున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. నిజామాబాద్ లో కవిత ఓటమికి కారణం అక్కడ రైతుల ఆందోళనే. పసుపు - ఎర్రజొన్నకు మద్దతు ధర - బోర్డుల ఏర్పాటులో అలసత్వంపైనే కవితపై పోటీచేసి ఓడించారు. అందుకే కవితకు ‘రైతు సమన్వయ సమితి’ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక మరో మాట కూడా వినపడుతోంది. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి కవితకు ఇచ్చి ఎమ్మెల్సీ చేసి మంత్రిని కూడా చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి..

అయితే కవిత నుంచి మాత్రం ప్రస్తుతం ఏ పదవి తీసుకునేందుకు ఆసక్తితో లేరట.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపుతో వచ్చిన పదవినే చేపడుతానని నామినేటెడ్ తీసుకోవడానికి ఆమె సిద్ధంగా లేరని ఆ మె సన్నిహిత వర్గాలు లీకులు ఇస్తున్నాయి.