Begin typing your search above and press return to search.
ఛోటా లీడర్లకు అదిరే స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్న కేసీఆర్?
By: Tupaki Desk | 17 Aug 2019 7:31 AM GMTగ్రౌండ్ లో ఏం జరుగుతుంది? అక్కడి పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం చేపట్టిన పథకాల విషయంలో ప్రజా స్పందన ఎలా ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటానికి రాజుల కాలం నుంచి నేటి ముఖ్యమంత్రుల వరకూ ఎవరికి తగ్గట్లుగా వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజుల కాలంలో మారువేషాలు వేసుకొని తిరిగేవారు. ఆధునిక కాలంలో గూఢాచార వ్యవస్థలతో పాటు.. ఆకస్మిక తనిఖీలతో హడావుడి చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందన్న అంశాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకొచ్చే రిపోర్టులతో పాటు.. తనకు తానే స్వయంగా ఫోన్లలో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. తాజాగా మిడ్ మానేరు నుంచి వస్తున్న వరద నీరు రైతులకు ఎంత లాభమన్న విషయాన్ని నేరుగా తెలుసుకునేందుకు పార్టీకి చెందిన ఒక ఛోటా నేతకు ఫోన్ చేశారు.
అంతా అయ్యాక.. వారి మాటలకు నమ్మకం కుదిరినా.. తన కళ్లతో చూడాలనుకున్నారేమో కానీ.. వీడియో కాల్ తో అక్కడి సీన్ తెలుసుకోవాలనుకున్నారు. కానీ.. సదరు నేత దగ్గర ఫోన్ మామూలుది కావటంతో అది సాధ్యం కాలేదు. గ్రౌండ్ లెవల్లో ఏంజరుగుతుందన్న విషయాన్ని వీడియో కాల్ తో తెలుసుకునే అవకాశం ఉండటంతో.. తన కళ్లతో తానే తెలుసుకునేందుకు వీలుగా.. రానున్న కొద్దిరోజుల్లో ఛోటా నేతలకు స్మార్ట్ ఫోన్లు అందజేసే ఆలోచనపై కేసీఆర్ మధనం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను అనుకున్నంతనే చేసేసే కేసీఆర్ కారణంగా టీఆర్ఎస్ ఛోటా నేతలకు స్మార్ట్ ఫోన్లు అందనున్నాయా? అంటే.. కాలమే దానికి తగిన రీతిలో సమాధానం చెప్పాలి.