Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ ఎప్పుడు పూర్త‌వుతుందంటే...!

By:  Tupaki Desk   |   19 July 2020 1:00 PM GMT
కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ ఎప్పుడు పూర్త‌వుతుందంటే...!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల అయిన నూత‌న స‌చివాల‌యం వైపు అడుగులు ప‌డుతున్నాయి. సుప్రీంకోర్టు - హైకోర్టు నుంచి అనుకూలంగా తీర్పు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి సెక్రటేరియట్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. కూల్చివేత పూర్తయిన తర్వాత లేదా కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు స్టార్టయ్యే ముందు సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు, మంగ‌ళ‌‌వారం తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. కాగా, కొత్త సెక్ర‌టేరియ‌ట్ ఎప్ప‌టికి పూర్తి కావాలో కేసీఆర్ డిసైడ్ చేసిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట - వైభవానికి ప్రతీకగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లపై చర్చిస్తారు. సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి - భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఆర్ అండ్ బి సమీక్షలో మంత్రి ప్రశాంత్ రెడ్డి - ముఖ్య కార్యదర్శి - ఇంజనీరింగ్ అధికారులు - తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్ - పొన్ని తదితరులు పాల్గొంటారు.

ఇదిలాఉండ‌గా, కొత్త సెక్రటేరియట్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ 2 నాటి కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణ మాసంలో నిర్మాణ పనులు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నిర్మాణ పనులను శ్రావణ మాసం లో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది జూన్ 2 నాటికి అంటే రాష్ట్ర ఆవిర్బావం రోజు కల్లా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే దాకా వరుస సమీక్షలు, పర్యటనలు, సీసీ కెమెరాల ద్వారా పనుల పర్యవేక్షణ ఎలా చేశారో సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా అలాగే సీఎం పర్యవేక్షించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.