Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు నచ్చనిది కేసీఆర్ చేస్తున్నారు
By: Tupaki Desk | 8 March 2020 6:41 AM GMTఏపీలో జగన్ సర్కారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అవును... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కారును అనుసరించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
కాగా దీనిపై తాజాగా కేసీఆర్ మాట్లాడినప్పటికీ గత కొన్ని నెలలుగా తెలంగాణ విద్యాశాఖ ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 42 వేలకు పైగా స్కూళ్లుండగా, వాటిలో 58.06 లక్షల మంది స్టూడెంట్స్చదువుతున్నారు. మెజార్టీ స్కూళ్లు సర్కారు పరిధిలోనే ఉన్నా, స్టూడెంట్లు మాత్రం ప్రైవేటు స్కూళ్లలోనే పెద్ద సంఖ్యలో చదువుతున్నారు.
సుమారు 10,700 ప్రైవేటు స్కూళ్లుంటే, వీటిలోనే 31.19 లక్షల మంది చదువుతున్నారు. ఇక సర్కారు విద్యాసంస్థలైన మోడల్స్కూళ్లు, గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం ఉంది.. అక్కడ సీట్లకు డిమాండ్ ఎక్కువ. కానీ తెలుగు మీడియంతో కొనసాగుతున్న సర్కారు స్కూళ్లలో మాత్రం ఏటా స్టూడెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ర్టంలో 2008లోనే సక్సెస్స్కూళ్ల పేరుతో గవర్నమెంట్హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. ప్రస్తుతం ఆ స్కూళ్లు 1,800 వరకు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఈ నాలుగైదు ఏండ్లలో సుమారు ఐదువేల ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. టీచర్లకు ఇంగ్లిష్మీడియం బోధనపై శిక్షణ ఇచ్చి, వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. తొలిసారిగా టీఆర్టీ ద్వారా 559 ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇప్పడు ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తే తెలంగాణలో విద్యాబోధన స్వరూపమే మారిపోనుంది.