Begin typing your search above and press return to search.
చైనా గోడ బాస్ కు ఏమీ పాఠాలు నేర్పలేదా?
By: Tupaki Desk | 16 Sep 2015 4:17 AM GMTముఖ్యమంత్రి కేసీఆర్ బృందం పదిరోజుల చైనా పర్యటన అనంతరం ఇవాళ నగరానికి తిరిగి రానుంది. తెలంగాణకు చైనా పారిశ్రామిక వేత్తలనుంచి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా.. ముఖ్యమంత్రి, మంత్రులు స్పీకరు అధికారులు అనేక మంది చైనాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు తిరిగి వస్తున్న ప్రస్తుత సమయంలో ఒక్క విషయం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంతకూ చైనా పర్యటనలో టూరిజం కూడా ఒక భాగం. చైనాలోని పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, పారిశ్రామిక వాడలు మాత్రమే కాకుండా.. అక్కడి పర్యాటక విశేషాలు అన్నిటినీ కూడా కేసీఆర్ బృందం తిలకించింది. ప్రపంచప్రఖ్యాత తియాన్మెన్ స్క్వేర్ - గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లను కూడా ఈ బృందం పరిశీలించింది.
అయితే వీటి సందర్శన తర్వాత.. కేసీఆర్ వైఖరిలో కొంత మార్పు వచ్చి ఉండాలే అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్నదంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ఆలోచన సరళిలో.. ఈ చైనాలోని ప్రపంచ ప్రఖ్యాత ప్రాంతాలుగా అలరారుతున్న నిర్మాణాలు భిన్నమైన ఆలోచనను కలిగించలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. చైనాగోడ అడ్భుతం అని అక్కడినుంచి దానిని ప్రశంసించిన సీఎం.. శిథిలమవుతుంది.. అని కూల్చేయకుండా వారు దానిని కాపాడుకున్నారు గనుకనే.. ఇవాళ్టికీ అది ప్రపపంచపు ప్రశంసలుపొందుతోంది అనే సంగతిని ఎందుకు గుర్తించలేదని అంటున్నారు.
వారసత్వ కట్టడాల విషయంలో చైనా మనకంటె చాలా అప్రమత్తంగా ఉంటుంది. వారసత్వాన్ని కాపాడుకోవడం ఒక గర్వకారణంగా భావిస్తుంది. శిథిల దశకు చేరుకునే పురాతన కట్టడాలను భద్రంగా కాపాడుకోవడానికి వారు అత్యంత ఆధునాతన సాంకేతిక మెళకువలను పాటిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన చైనా టూర్ లో వారి ఆ విలక్షణత నేర్చుకుని ఉంటే బాగుండేదని.. ఆ సాంకేతిక మెళకువలను భారత్ కు తీసుకువచ్చి ఉస్మానియా ఆస్పత్రిని కూడా కాపాడుకునే ఆలోచన చేసి ఉంటే ప్రజలు గర్వించి ఉండేవారని పలువురు అంటున్నారు. విదేశాలు పర్యటించినప్పుడు.. అక్కడి పురాతన కట్టడాలను చూసి పొగిడి వచ్చేయడం కాదు, వారు కాపాడుకుంటున్న స్ఫూర్తిని అందుకుని మన నిర్మాణాల విషయంలో పాటించాలని అనేకులు హితవు చెబుతున్నారు.