Begin typing your search above and press return to search.
గవర్నర్ తో కేసీఆర్ భేటీ
By: Tupaki Desk | 2 Oct 2015 8:54 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తాజాగా మరోమారు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే గవర్నర్ ను కలిసిన కేసీఆర్ సభ జరుగుతున్న సమయంలో గురువారం కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. అదే క్రమంలో మరోమారు తాజాగా శుక్రవారం మధ్యాహ్నం కూడా ఆయన గవర్నర్ తో భేటీ కానుండటంపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తుతోంది.
ఇటీవల పదేపదే తన మంత్రివర్గ సహచరులపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి పదవులు కూడా ఊడనున్నాయనే వార్తలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి. ఈ మార్పులు చేర్పుల గురించి చర్చించేందుకు గవర్నర్ వద్దకు కేసీఆర్ వెళ్తున్నారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే కొందరు ఆశావహులు మాత్రం ఇందుకు భిన్నమైన సమాధానం ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన సమయానికల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని, ఆ ప్రక్రియ గురించి రాజ్యాంగ పెద్ద అయిన కేసీఆర్ కు సమాచారం ఇచ్చేందుకు వెళ్తున్నారని పేర్కొంటున్నారు. మొత్తంగా ఒక్కరోజు వ్యవధిలోనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రెండు సార్లు గవర్నర్ ను కలవడం అంటే కీలకమైన అప్ డేట్ ఉండి ఉంటుందనేది నిజం.