Begin typing your search above and press return to search.
మరో సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్..
By: Tupaki Desk | 10 Sep 2016 4:57 AM GMTఅధినేతలు ఎంతమంది ఉన్నా కొందరు మాత్రం మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ధైర్యంగా దూసుకెళుతూ.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండితనానికి కేరాఫ్ అడ్రస్ లాంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత మొండి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దృష్టి ఏదైనా విషయం మీద పడాలే కానీ.. దాని కత మొత్తంగా చూసే వరకూ వదిలిపెట్టరు. ఆ విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది కూడా. ఈ మధ్యనే జరిగిన గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ ఇష్యూలో కూడా తేలిపోయిందని చెప్పక తప్పదు.
నయిం నిన్నటికి నిన్న పుట్టినోడు కాదు. అతగాడి ఆరాచకం దశాబ్దాలుగా సాగుతోంది. నిజానికి నయింను పెంచిపోషించింది పలువురు రాజకీయ నేతలే. అతగాడి తీరును.. అతగాడి దందాల గురించి నిఘా వ్యవస్థ దగ్గర సమాచారం ఉండకుండా ఉండదు. ఉన్నప్పటికీ ఇంతకాలం చూసీచూడనట్లుగా ఎలా వ్యవహరించారు? అదెలా సాధ్యమైందన్నది ఇప్పటికీ బయటకు రాని అంశం. ఇదిలా ఉంటే.. మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇప్పటివరకూ సీఎంలుగా ఉన్న వారంతా నయిం విషయాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా తానేం చేయాలో అది చేసి చూపించారని చెప్పాలి.
నయిం ఎన్ కౌంటర్ తర్వాత అతగాడి దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ షాకులు ఇస్తున్నాయి.చివరకు అతడితో అంటకాగిన రాజకీయ నేతలు సైతం.. నయింలో ఇలాంటి రాక్షసుడు ఉన్నాడా? అని విస్మయానికి గురి అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మాటల్లో నిజం సంగతి ఎలా ఉన్నా.. నయింతో చెట్టాపట్టాలు వేసుకొన్న రాజకీయ నేతల అంశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. భారీ ఎత్తున రాజకీయ నేతలు నయింతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. అలాంటి వారందరిపైనా చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నయింతో సంబంధాలు ఉన్న నేతలపై చర్యలు తీసుకునేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన నేతలు కొందరు ఉన్నట్లుగా వస్తున్న సమాచారంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవటానికి కొందరునేతలు ప్రయత్నిస్తున్నా.. ముఖ్యమంత్రి మాత్రం ఈ ఇష్యూను తేల్చాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ మీద వేటు వేయటంతో పాటు.. మరికొందరునేతలపైనా చర్యలు తీసుకోవటం ద్వారా.. నయిం ఇష్యూలో తాను ఏ ఒత్తిడిని ఒప్పుకునేది లేదన్న విషయాన్ని తేల్చి చెప్పాల్సన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన రాజకీయ పక్షాలకు చెందిన నేతలపై చర్యలు తీసుకోవటానికి ముందు తమ పార్టీకి చెందిన వారిపైనే చర్యలు తప్పవన్నమాట వినిపిస్తోంది. ఒకవేళ.. అదే పని చేస్తే కేసీఆర్ చిరస్థాయిగా ప్రజల మనసుల్లో ఉండిపోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.