Begin typing your search above and press return to search.
కేసీఆర్ మరో యాగం...ఇది దేశం కోసం
By: Tupaki Desk | 28 Dec 2018 1:44 PM GMTతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారనే సంగతి తెలిసిందే. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా వాస్తు..సంఖ్య శాస్త్రం...ఇతరత్రా చూసుకుని ముందుకు కదులుతుంటారు. పూజలతో పాటు యాగాలపై కూడా విశ్వాసం ఎక్కువ. గతంలో పలు యాగాలు నిర్వహించిన గులాబీ బాస్....2015లో ఆయుత చండీయాగం నిర్వహించారు కూడా. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్...జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం నాన్ బీజేపీ..నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు..దేశంలోని పార్టీల నేతలను కలిసి దానిపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన యాగంపై కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మ్రోగించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజశ్యామల యాగం జరిపించిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో యాగంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. జనవరి 21 నుండి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో యాగాన్ని నిర్వహించబోతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఏ యాగం చేయబోతున్నారు ? దాని పేరు ఏంటీ ? అనేది తెలియరావడం లేదు. మరి గులాబీ దళపతి యాగం చేస్తారా ? లేదా ? ఇవన్నీ..కేసీఆర్ మార్క్ సస్పెన్స్‌లో భాగమనే సంగతి తెలిసిందే.