Begin typing your search above and press return to search.

జగన్ కోసం హైదరాబాద్ లో.. కేసీఆర్ నిర్ణయం..

By:  Tupaki Desk   |   30 May 2019 5:54 AM GMT
జగన్ కోసం హైదరాబాద్ లో.. కేసీఆర్ నిర్ణయం..
X
తెలంగాణ - ఆంధ్రా విడిపోయి 5 ఏళ్లు అయ్యాయి. అయినా ఇంకా ఎన్నో సమస్యలు - నీటి వివాదాలు - ఉద్యోగాల పంపకాల విషయంలో గొడవలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. అంతర్రాష్ట్ర జలవివాదాలు లేకపోలేదు.అందుకే ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్ట పరిచేందుకు.. హైదరాబాద్ తో ఆంధ్రా ప్రజలకు విడదీయరాని అనుబంధాన్ని కొనసాగించేందుకు జగన్ నిర్ణయించినట్టు సమాచారం. అందుకే కొంత మంది ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం హైదరాబాద్ పరిస్థితులు చక్కదిద్దేలా ఏర్పాటు చేయడానికి జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో చెప్పినట్లు తెలిసింది.

హైదరాబాద్ ఏపీ - తెలంగాణకు పదేళ్లు ఉమ్మడి రాజధాని.. ఓటుకు నోటులో ఇరుక్కొని కేసీఆర్ తో విభేదించి బాబు అమరావతికి వెళ్లిపోయాడు. పాలనా యంత్రాంగాన్ని మార్చేశారు. అయితే జగన్ మాత్రం తాను హైదరాబాద్ క్యాంప్ ఆఫీసును వాడుకుంటానని.. ఏపీకి కేటాయించిన సచివాలయంలోని బ్లాకులను అవసరార్థం వాడుకుంటామని కేసీఆర్ కు జగన్ చెప్పినట్లు టీఆర్ ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. పెండింగ్ లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించడానికి.. తెలంగాణ అధికారులతో సమన్వయం చేసుకోవడానికి కొంత మంది ఏపీ అధికారులను హైదరాబాద్ లో ఉంచాలని జగన్ భావిస్తున్నారు.

విద్యుత్ వినియోగం.. ఉన్నత విద్య - ఆబ్కారీ విషయాలు - జలవనరుల కేటాయింపు విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించడానికి జగన్ ఈ ప్రతిపాదన తేగా కేసీఆర్ ఓకే చేసినట్లు సమాచారం.

అందుకే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసును సిద్ధం చేయాలని కేసీఆర్ తెలంగాణ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కుదుర్చుకోవడానికి .. జగన్ కేసీఆర్ వేసిన ఈ ప్లాన్ రెండు రాష్ట్రాలకు మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.