Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడుగులు మళ్లీ 'ఫెడరల్ ఫ్రంట్' వైపు..

By:  Tupaki Desk   |   6 May 2019 4:17 AM GMT
కేసీఆర్ అడుగులు మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ వైపు..
X
కేసీఆర్ సడన్ స్ట్రైక్స్.. మొన్నటి వరకు గమ్మున ఉన్న నేత ఇప్పుడు దక్షిణాది బాటపట్టాడు. కేసీఆర్ ఏదైనా స్టెప్ ఉందంటే అందులో అర్థం పరమార్థం ఖచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కూడా అన్నీ ఆలోచించాకే మళ్లీ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బలోపేతానికి నడుం బిగించినట్టు సమాచారం.

సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు మళ్లీ బీజేపీయే దేశంలో అధికారంలోకి వస్తుందని అంచనాలుండేవి. మెజార్టీ తగ్గి మిత్రపక్షాలతో బీజేపీయే గద్దెనెక్కుతుందని సర్వేలు హోరెత్తాయి. దీంతో కేసీఆర్ కూడా తన ఫెడరల్ ఫ్రంట్ ను పక్కనపెట్టారు. మిన్నకుండిపోయారు.

అయితే నిన్న కేసీఆర్ చేతికి పలు సర్వే రిపోర్టులు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే జగన్ ఏపీలో గెలుస్తాడని.. ఆయన ప్రమాణ స్వీకారానికి తాను స్వయంగా హాజరవుతానని ప్రకటించారు. బాబు చిత్తుగా ఓడుతాడని చెప్పుకొచ్చాడు.

ఇక దేశంలో నాలుగు విడతల ఎన్నికలు పూర్తయిపోయాయి. నేడు ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. గడిచిన పోలింగ్ సరళి చూశాక అందరికీ అర్థమైపోయింది. మోడీ మళ్లీ రావడం కష్టమేనని.. బీజేపీ 140 సీట్లు దాకా మాత్రమే వస్తాయని కేసీఆర్ కు సమాచారం అందినట్లు సమాచారం.

పక్కా సమాచారం అందాకే.. మరుగున పడ్డ ‘ఫెడరల్ ఫ్రంట్’ దుమ్ముదులిపి మళ్లీ ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టేందుకు కేసీఆర్ నడుం బిగించారు. ఈరోజు కేరళ వెళ్లి కమ్యూనిస్టులను ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. ఆ తర్వాత తమిళనాడు వెల్లి శ్రీరంగం - రామేశ్వరం సందర్శించి తమిళ పార్టీలతో చర్చించి కర్ణాటకకు వెళతారు. అక్కడ కూడా ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించి తిరిగొస్తారు. ఇలా దేశంలో హంగ్ వచ్చే అవకాశాలున్నాయని అర్థం మయ్యాకే కేసీఆర్ ఈ స్టెప్ తీసుకున్నారని అర్థమవుతోంది. అటు రాజకీయం.. ఇటు కేసీఆర్ ఇష్టమైన ఆధ్యాత్మికం రెండూ ఒకేసారి కానిచ్చేస్తున్నారన్న మాట..