Begin typing your search above and press return to search.

హ‌రీశ్ రావును కేసీఆర్ ఎక్క‌డికి పంపిస్తారో?

By:  Tupaki Desk   |   26 Jan 2018 10:37 AM GMT
హ‌రీశ్ రావును కేసీఆర్ ఎక్క‌డికి పంపిస్తారో?
X
త‌న్నీరు హ‌రీశ్ రావు... ప‌రిచయం అక్క‌ర్లేని పేరే. టీఆర్ ఎస్ నేత‌గా కంటే కూడా ఆ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మేన‌ల్లుడిగా - మామ ముందుంటే... వెనుకుండి మొత్తం వ్య‌వ‌హారం న‌డిపించిన స‌త్తా క‌లిగిన యువ‌కుడిగానే మ‌నందరికీ తెలుసు. అస‌లు హ‌రీశ్ రావు రాజ‌కీయాల్లోకి చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగానే జ‌రిగింద‌ని చెప్పాలి. తెలంగాణ ఉద్య‌మం పీక్ స్టేజీకి వెళ్లేందుకు కాస్తంత ముందుగా కేసీఆర్ పార్ల‌మెంటుకు వెళ్లాల‌ని భావించి... త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సిద్దిపేటను వ‌దిలేసి క‌రీంన‌గ‌ర్‌ కు వెళ్లిన‌ప్పుడు.. మ‌రి సిద్ధిపేట నుంచి ఎవ‌రు పోటీ చేయాల‌న్న ప్ర‌శ్న ఉద‌యించిన‌ప్పుడు కేసీఆర్‌ తో పాటు ఆయ‌న‌ను ఏళ్లుగా గెలిపిస్తూ వ‌చ్చిన సిద్దిపేట ప్ర‌జ‌ల‌కు హ‌రీశ్ రావు త‌ప్పించి మ‌రో నేత క‌నిపించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ఎందుకంటే త‌మ‌కు ప్ర‌జా ప్ర‌తినిధి కేసీఆరే ఆయినా... త‌మ స‌మ‌స్య‌ల‌న్నీ తీర్చే నేత‌గా హ‌రీశ్ రావే వారికి సుప‌రిచితులు. అందుకే.. సిద్దిపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అప్ప‌టిదాకా కేసీఆర్‌ కు వ‌చ్చిన మెజారిటీ కంటే కూడా బంప‌ర్ మెజారిటీతో అక్క‌డి ప్ర‌జ‌లు హ‌రీశ్ రావును గెలిపించి అసెంబ్లీకి పంపారు. సిద్దిపేట ప్ర‌జ‌లు ఇచ్చిన మెజారిటీ... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా హరీశ్ రావును ప్ర‌శంసించేలా చేసింద‌న్న విష‌యం కూడా మ‌నం మ‌రువ‌లేనిదే.

మొత్తానికి హ‌రీశ్ రావు అతి త‌క్కువ కాలంలోనే బ‌లమైన నేత‌గానే కాకుండా స‌త్తా క‌లిగిన‌, విష‌య ప‌రిజ్ఞాన‌మున్న నేత‌గా, ఏ విష‌యంపై అయినా త‌న‌దైన వాణిని వినిపించి ఎదుటి వారిని మ‌ట్టి క‌రిపించ‌గ‌లిగే నేత‌గా గుర్తింపుప పొందారు. విష‌యం ఏదైనా అవ‌త‌లి వైపున హ‌రీశ్ ఉన్నారంటే... ఇవ‌త‌లి వారికి త‌డిసిపోవాల్సిందే. ఇదే స‌మ‌యంలో టీఆర్ ఎస్‌ లో వార‌స‌త్వం గురించిన మాట వ‌చ్చిన‌ప్పుడు... కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ - కూతురు క‌విత రంగంలోకి ఇప్ప‌టికే దిగేసినా కూడా తొలి ఛాన్స్ మాత్రం హ‌రీశ్ రావుదేన‌న్న వాద‌న ఎప్ప‌టినుంచో వినిపిస్తున్న‌దే. ఇదే విష‌యాన్ని గ్ర‌హించిన కేసీఆర్‌.. తన కుమారుడిని ప్రొజెక్ట్ చేసుకునేందుకు హ‌రీశ్ రావుకు క్ర‌మంగా ప్రాధాన్యం త‌గ్గించార‌ని, కేటీఆర్‌ కు ప్రాధాన్యం క‌లిగిన శాఖ‌ల‌ను అప్ప‌గించార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంలో ఎంత నిజ‌ముందో తెలియదు గాని.. ఇటీవ‌లి కాలంలో హ‌రీశ్ రావుకు కేసీఆర్ అంత‌గా ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లుగా అయితే క‌నిపించ‌డం లేద‌నే మాట మాత్రం వినిపిస్తోంది.

మ‌రి 2019 ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్నాయి. మ‌రో ఏడాది మాత్ర‌మే స‌మ‌య‌ముంది. ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌ ను ఓడించేందుకు తెలంగాణ‌లోని దాదాపుగా అన్ని పార్టీలు కూడా వ్యూహాల‌ను ర‌చించుకుంటున్నాయి. అవ‌స‌ర‌మైతే... టీఆర్ ఎస్‌ ను ఓడించేందుకు అన్ని పార్టీలు జ‌ట్టు క‌ట్టినా... ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో 2014లో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ ఎస్‌ కు భ‌విష్యత్తు ఎలా ఉంటుందో చెప్ప‌లేం గానీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆ పార్టీ వెంటే ఉంటారన్న విశ్లేష‌ణ‌లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మ‌రి వ‌చ్చే ప‌ర్యాయం కూడా టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే... కేటీఆర్‌ ను మ‌రింత‌గా ప్రొజెక్టు చేసుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో ఓ వైపు హ‌రీశ్ రావును ప‌క్క‌న‌పెట్టుకుని... ఆయ‌న కంటే కేటీఆర్ నే నిత్యం ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతే... ప్ర‌జ‌లేమీ గ‌మ‌నించ‌లేర‌ని కేసీఆర్ ఈజీగా తీసుకోలేరు క‌దా. హ‌రీశ్ రావును ప‌క్క‌న పెట్టేస్తే.. కేటీఆర్ ను ఎంత‌గా ప్రొజెక్టు చేసుకున్న అంత ఇబ్బందేమీ ఉండ‌దు. అదే భావ‌న‌తో ఉన్న కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌దైన వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నార‌ట‌.

త‌న కొడుకు ఎదుగుద‌ల‌కు అడ్డుగా మారిన హ‌రీశ్ రావును వ‌చ్చే ఎన్నికల్లో పార్ల‌మెంటుకు పంపేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ట‌. ఈ విష‌యంపై ఆయ‌న ఇప్ప‌టికే ఓ స్ఫ‌ష్టమైన వైఖ‌రితో ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని గ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి... ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. హ‌రీశ్ రావును ఈ ద‌ఫా ఎమ్మెల్యే టికెట్ ద‌క్క‌ద‌ని, హ‌రీశ్ ను ఎంపీగా పోటీ చేయించి జాతీయ రాజ‌కీయాల్లోకి పంపేందుకు కేసీఆర్ సిద్ధ‌మైపోయార‌ని రేవంత్ చెప్పారు. హ‌రీశ్ తో పాటు టీఆర్ ఎస్‌ లో కీల‌క నేత‌లుగా ఉన్న మంత్రులు ఈటెల రాజేందర్ - కడియం శ్రీహరిలకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్లే ద‌క్క‌నున్నాయ‌ని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. సీనియర్లను రాష్ట్రం నుండి తప్పించేందుకే కేసీఆర్‌ ఈ ప్లాన్ చేస్తున్నారని రేవంత్ అభిప్రాయపడ్డారు. చూద్దాం... ఏం జ‌రుగుతుందో.