Begin typing your search above and press return to search.
విశాఖలో కేసీయార్ సభ...బిగ్ షాట్స్ టార్గెట్
By: Tupaki Desk | 19 Jan 2023 2:30 AM GMTకేసీయార్ ఖమ్మం సభ తరువాత ఏపీలో ఎక్కడ అడుగు పెడతారు అన్నది ఇపుడు తెలిసింది. ఆయన విశాఖలో బీయారెస్ సమర శంఖారావాన్ని పూరిస్తారు అని అంటున్నారు. ఖమ్మంలో సభ అంటే అది ఎటూ విజయవాడకు కూడా సరిపోతుంది కాబట్టి ఉత్తరాంధ్రా ఉభయగోదావరి జిల్లాలను కవర్ చేసేలా విశాఖలో కేసీయార్ భారీ సభకు స్కెచ్ గీశారు అని అంటున్నారు.
ఇక విశాఖ సభ వెనక కేసీయార్ ఆలోచనలు కూడా చాలా ఉనాయని అంటున్నారు. కేసీయార్ పూర్వీకులు ఉత్తరాంధ్రాకు చెందిన వారు. వారంతా బొబ్బిలికి చెందినవారు. అందువల్ల కేసీయార్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఒకనాటి తన సొంత గడ్డ మీద బీయారెస్ పార్టీ జెండాను రెపరెపలాడించాలని వ్యూహం రచించారు అని తెలుస్తోంది.
అదే విధంగా కేసీయార్ సామాజికవర్గం కూడా ఉత్తరాంధ్రాలో అధిక సంఖ్యలో ఉన్నారు. దాంతో వారిని అట్రాక్ట్ చేయడానికి ఆయన సభకు విశాఖను వేదికగా చేసుకున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా మీద మొదటి నుంచి కేసీయార్ కన్ను ఉంది. దానికి కారణం బీసీలు ఎక్కువగా ఉండడం, వెలమలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం అని చెబుతారు.
అదే విధంగా కేసీయార్ కొందరు కీలక నాయకులను తన పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. వారితో ఇప్పటికే మంతనాలు జరిపినట్లుగా చెబుతున్నారు. ఆ నాయకులు ఏ పార్టీకి చెందిన వారు అన్నది బయటకు పొక్కకపోయినా కేసీయార్ తనదైన రాజకీయ చాణక్యంతో బడా నాయకులకే వల వేశారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో బీయారెస్ పునాదులు గట్టిగా పడాలన్న ఉద్దేశ్యంతో ఆయన బలమైన నాయకులను ఆహ్వానిస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏపీలో కీలకమైన నాయకులు పార్టీలో చేరుతారు అని ప్రచారం సాగినా కూడా ఎవరూ చేరలేదు. అయితే విశాఖలో కేసీయార్ సభను ఏర్పాటు చేస్తే ఆ రోజున చాలా మంది నాయకులు ఆయన సమక్షంలో బీయారెస్ జెండా కప్పుకుంటారు అని అంటున్నారు.
ఏపీలో పొలిటికల్ స్పేస్ చాలా ఉంది అని నమ్ముతున్న కేసీయార్ వైసీపీ టీడీపీ జనసేన అంటే ఇష్టం లేని వారిని తమ వైపు లాక్కొవడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ జరగాలని అపుడే తమకు కూడా అవకాశం ఉంటుందని కేసీయార్ భావిస్తున్నారు. నిజానికి ఏపీలో బహు ముఖ పోటీలను నివారించాలని ఒక వైపు చంద్రబాబు మహా కూటమి దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
అయితే కేసీయార్ మాత్రం పోటీ ఎంత ఎక్కువగా ఉంటే తమకు అంత లాభం అని కొత్త ఆలోచనలకు తెర తీస్తున్నారు. దాంతోనే ఆయన ఏపీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని, ప్రత్యేకించి ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాల మీదనే దృష్టి కేంద్రీకరించరని అంటున్నరు. కేసీయార్ ఈ నెలాఖరులోగా విశాఖలో సభ పెడతారని అంటున్నారు. మరి కేసీయార్ ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు బీయారెస్ లో చేరుతారు అన్నది ఇపుడు చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.