Begin typing your search above and press return to search.

యశోద ఆస్పత్రికి కేసీఆర్

By:  Tupaki Desk   |   21 April 2021 2:33 PM GMT
యశోద ఆస్పత్రికి కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి రానున్నారు. కరోనా సోకి ప్రస్తుతం ఆయన ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఆయనకు కరోనా తగ్గిందా? లేదా? ఏ స్థాయిలో ఉందనే దానిపై డాక్టర్లు పరీక్షలు చేయాలని డిసైడ్ అయ్యారు. డాక్టర్ల సూచనతో ఆస్పత్రికి రానున్నారు.

కేసీఆర్ కు స్కానింగ్ తీసిన అనంతరం వచ్చే రిపోర్టులను బట్టి ఆయనకు హోం ఐసోలేషన్ సరిపోతుందా? లేక ఆస్పత్రిలో చికిత్స ఇవ్వాలా? అనేది రిపోర్టులను బట్టి నిర్ణయించనున్నారు.కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయనకు వైద్యులు వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకున్నట్టు తెలిసింది..