Begin typing your search above and press return to search.
తెలంగాణలో ముందస్తు ఖాయం.. అసెంబ్లీ రద్దు దిశగా కేసీఆర్?
By: Tupaki Desk | 2 Sep 2022 11:30 AM GMTతెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం సీఎం కేసీఆర్.. అసెంబ్లీ రద్దుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. అదే జరిగితే గనుక ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయని అనుకోవచ్చు. అంటే.. వాస్తవ షెడ్యూల్ కంటే ఏడాది ముందే ఎన్నికలు జరుగుతాయని అనుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని రాజకీయ వేడి ఇంకా పెరిగి ప్రతిపక్షాలు కాలూచేయీ కూడదీసుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలనేది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పుంజుకోకముందే
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పుంజుకునే స్థితిలో ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో సంస్థాగతంగా బలమైన కాంగ్రెస్.. అధికార టీఆర్ఎస్ కు సవాలు విసురుతోంది. ఈ సవాలు ఎంత గట్టిగా ఉందంటే.. టీఆర్ఎస్ అభ్యర్థిని ఆచితూచి ఎంపిక చేయాల్సినంతగా ఉంది. మరోవైపు రాష్ట్రవాప్తంగానూ కాంగ్రెస్ జవజీవాలు కూడదీసుకుంటోంది. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నందున ఆ పార్టీ సంస్థాగతంగా తిరుగులేని స్థాయిలో ఉంది. నియోజకవర్గాల్లో నేతలను ఒక్క తాటిపైకి తీసుకొస్తే కాంగ్రెస్ పోటీలో నిలుస్తుంది. రేవంత్ నాయకత్వంలో ఆ పని ఎంత తొందరగా సాగితే అంతగా బలం పుంజుకుంటుంది. ఇక బీజేపీ.. కేంద్ర పెద్దల అండ చూసుకుని తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోంది.
అయితే, ఆ పార్టీకి సంస్థాగతంగా బలం చాలా స్వల్పం. అంతేగాక చాలా నియోజకవర్గాల్లో నాయకత్వమే లేదు. ప్రస్తుతం నాయకులను సమీకరించే ప్రయత్నాలు సాగిస్తోంది. ఇది జరిగేందుకు మరికొంత సమయం పట్టడం ఖాయం. అయితే, అధికార టీఆర్ఎస్ పరిస్థితి ఇలా కాదు. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండడం.. ఈ కాలంలో బలీయంగా ఎదగడంతో ఆ పార్టీ చాలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. సంస్థాగతంగానూ ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ బలపడినంతగా ఏ పార్టీ బలపడలేదని చెప్పుకోవాలి. ఆ పార్టీకి నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరనే బాధ లేదు. ఒక్కోచోట వర్గ పోరు కూడా సాగుతోంది. వీటినిబట్టి చూస్తే టీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా బలమైన పోటీ ఇవ్వగలదు. అందుకనే బీజేపీ, కాంగ్రెస్ పుంజుకునే లోపే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుస్తులో ముందస్తు
వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన 2014 జూన్ 2నే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిప్రకారం 2019 జూన్ వరకు రాష్ట్ర అసెంబ్లీ గడవుంది. అయితే, కేసీఆర్ 2018 సెప్టెంబరులోనే అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తుకు వెళ్లారు. దీంతో 2018 డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. ఆర్నెల్ల ముందే శాసనసభ కాలం ముగిసింది. ఈసారి ఏకంగా ఏడాది ముందుగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. 2018 డిసెంబరు నుంచి చూస్తే 2023 డిసెంబరు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గడువుంది. కానీ, ఇప్పుడే కేసీఆర్ ముందుస్తుకు కాలు దువ్వుతున్నారు. ఈ లెక్కన 2022 డిసెంబరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏడాది ముందే ఎన్నికలు జరిగి ప్రభుత్వం కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది.
జాతీయ రాజకీయాలపై కన్నేయొచ్చనా?
కేసీఆర్ చూపు ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఉంది. అందుకే వరుసగా ఇతర రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలో పదేపదే ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళితే.. ఆయనకు జాతీయ రాజకీయాలపై చూపు నిలిపేందుక సమయం చిక్కుతుంది. లోక్ సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ లో జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలు 2023 డిసెంబరు లో జరగాలి. ముందస్తుకు వెళ్తున్నందున ఏడాది ముందే జరుగుతాయి. అంటే.. లోక్ సభ ఎన్నికల సమయానికి కేసీఆర్ నిశ్చితంగా జాతీయ రాజకీయాలపై చూపు సారించే అవకాశం ఉంటుంది. అప్పటికి వీలైతే తెలంగాణలో కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయొచ్చు.
రేపటి సమావేశాలు అందుకేనా...?
కేసీఆర్ శనివారం టీఆర్ఎస్ పార్టీ సమావేశం, శాసన సభా పక్ష సమావేశం రెండింటినీ ఏర్పాటు చేశారు. దీన్నిబట్టే ఏదో సంకేతాలు వెళ్తున్నాయి. మరోవైపు ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఆ సమావేశాల్లో కేసీఆర్ అసెంబ్లీని రద్ద చేసి ముందుస్తు పేరిట సంచలన నిర్ణయం ప్రకటిస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.