Begin typing your search above and press return to search.
కేసీఆర్ సంతకంతో 7,255కోట్ల కుంభకోణం?
By: Tupaki Desk | 30 Oct 2015 3:34 AM GMTతాజాగా వెలుగులోకి వచ్చిన సహారా వ్యవహారం ఇప్పుడు సెగలు రేపుతోంది. కేంద్ర కార్మిక మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ తీసుకున్న ఒక్క అనాలోచిత నిర్ణయం కారణంగా భారీ కుంభకోణానికి కారణమైందన్న మాట ఇప్పుడు తీవ్రస్థాయిలో వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఎదురే లేకుండా పోయిన కేసీఆర్ కు తాజా వ్యవహారాలు మింగుడుపడనివిగా మారాయన్న మాట వినిపిస్తోంది. సహారాకు అనుచిత లబ్థి చేకూర్చారంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రముఖంగా వార్తలు రాస్తున్నాయి. తాజాగా సదరు మీడియా సంస్థ మరో భారీ కథనాన్ని వెలువరించింది. కేంద్రమంత్రిగా కేసీఆర్ వ్యవహరించిన తీరుతో భారీ నష్టం వాటిల్లిందని.. పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందని ఆరోపించింది. ఆ వివరాలు చూస్తే..
సహారా గ్రూపునకు చెందిన 5 కంపెనీలకు చెందిన 11 లక్షల ఉద్యోగుల పీఎఫ్ మొత్తాన్ని తమకు తామే నిర్వహించుకుంటామని సహారా కోరిందని చెబుతున్నారు. అందుకు నాటి కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ అనుమతి ఇవ్వటంతో ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా వసూలు చేసే పీఎఫ్ మొత్తం.. సహారా సంస్థ ఇవ్వాల్సిన పీఎఫ్ మొత్తం సహారానే లెక్క చూసుకునే వెసులుబాటు కలిగినట్లుగా ఆరోపణలున్నాయి.
అయితే.. ఈ మొత్తాన్నిసహారా సంస్థ ఏం చేసిందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని చెబుతున్నారు. 11 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ ఖాతాల నిర్వహణకు సహారా ఇండియా ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉద్యోగుల నుంచి వసూలు చేసిన పీఎఫ్ మొత్తంతో పాటు.. సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్ని ఈ ట్రస్ట్ లో కంపెనీ జమ చేయాలి. కానీ.. నష్టాల్లో కూరుకుపోయిన సహార సంస్థ అలాంటి పని చేయలేదు. అదే కానీ.. కేంద్రమంత్రి కానీ ట్రస్ట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వని పక్షంలో ఆ మొత్తాన్ని తప్పనిసరిగా పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉండేది. ఒకవేళ జమ చేయని పక్షంలో ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకునేది.
ఇలాంటి తప్పుల కారణంగా 11 లక్షల మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగులకు చెందిన దాదాపు రూ.7,255కోట్ల మొత్తాన్ని జమ చేయలేదని చెబుతున్నారు. ఐదు కంపెనీలకు సంబంధించి కంపెనీ తన వాటాగా చెల్లించాల్సిన మొత్తాన్ని జమ చేయటం తర్వాత సంగతి.. ఉద్యోగుల జీతం నుంచి తీసుకొని జమచేయాల్సిన మొత్తాన్ని కూడా జమ చేయలేదన్నది తాజా ఆరోపణ. దీనికి సంబంధించి ప్రస్తుతం వివాదం కోర్టు దగ్గరకు వెళ్లినట్లు ఆరోపిస్తున్నారు.
ఇక్కడ ప్రశ్నలేమంటే.. సహారా కంపెనీకి లబ్థి చేకూరేలా కేసీఆర్ ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. అదే నిజం అనుకుంటే.. సహారాపై నిర్ణయం తీసుకున్న స్వల్ప వ్యవధిలోనే కేంద్రమంత్రిగా కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన మంత్రి కావొచ్చు.. యూపీఏ 2లో కేంద్ర కార్మిక మంత్రులుగా వ్యవహరించిన వారు చూస్తూ ఎందుకు ఊరకుండిపోయారన్నది పెద్ద ప్రశ్న. కేసీఆర్ ను నొచ్చుకోకూడదన్న ఉద్దేశంతో నాటి యూపీఏ సర్కారు పట్టించకోలేదన్న మాట చెబుతున్నప్పటికీ.. తప్పు జరిగినప్పుడు కేసీఆర్ తర్వాత మంత్రి బాధ్యతలు స్వీకరించిన వారు చూసిచూడనట్లుగా వ్యవహరించటం చూసినప్పుడు కేసీఆర్ పాత్ర కంటే కూడా.. అంతకు మించిన మరేదో అదృశ్య శక్తి ఈ వ్యవహారంలో కీలకభూమిక పోషించిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. సహారాకు చెందిన ఈ వ్యవహారాన్ని ఒక్క కేసీఆర్ కోణంలో చూడటం సరికాదన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.