Begin typing your search above and press return to search.
హరికృష్ణ కు అందరి వందనం
By: Tupaki Desk | 29 Aug 2018 1:59 PM GMTసినీనటుడు - రాజ్యసభ సభ్యుడు - దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ హఠత్మరణంపై అన్నీ వర్గాల నుంచి దిగ్భ్రాంతి - సానుభూతి వ్యక్తం చేసారు. ఆయన మరణం అన్నీ వర్గాల వారిని కలచివేసింది. అన్నీ పార్టీలు సినీరంగానికి చెందని వారు - పారిశ్రామిక రంగానికి చెందిన వారు ఇలా అందరూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి - రాష్ట్రాన్ని విడదీనసినందుకు హరికృష్ణ ముందుగా స్పందించారు. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆయన చర్యను అప్పట్లో తెలంగాణ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. అయిన హరికృష్ణ దేనికి వెరవలేదు. హరిక్రిష్ణ భౌతికకాయాన్ని చూపి నివాళులు అర్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. హరిక్రిష్ణ పార్దీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళ్లులు అర్పించారు. హరిక్రిష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ఔదార్యం కంటే హరికృష్ణ తన జీవితంలో చూపించిన ముక్కుసూటి తనమూ - నిజాయితీయే కారణమని అందరూ అంటున్నారు.
హరికృష్ణ ఇంటికి వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎదురుపడ్డారు. వారిద్దరూ కొంతసేపు హరికృష్ణ గురించి చర్చించుకోవడం కనిపించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన హరికృష్ణ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలని నిర్ణయించడంతోనే హరికృష్ణ వ్యక్తిత్వం బహర్గితమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు - హరికృష్ణ కు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర రవాణశేఖ మంత్రిగా నాయుడు పనిచేసారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ శాఖకు కేసీఆర్ మంత్రి అయ్యారు. దీంతో వీరివురు రవాణశాఖ గురించి చర్చించుకునేవారు. తెలుగుదేశం పార్టీలో ఇతర నాయకుల కంటే కేసీఆర్ కు హరికృష్ణ తోనే అనుబంధం ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ కు బహిరంగంగాను - హరికృష్ణ అంతర్గతంగాను ఏకైక శత్రువు చంద్రబాబు నాయడే కావడం కొసమేరుపు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంఘటనా స్దలానికి పంపిచారు. అక్కడి నుంచి వైద్యం అందిస్తున్న కామినేని ఆసుపత్రికి తమ నాయకులను పంపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయాన బావ అయిన నారా చంద్రబాబు నాయుడు కూడా హెలికాఫ్టర్ లో హైదారబాద్ చేరుకున్నారు.