Begin typing your search above and press return to search.
అల్లుడి వద్దకు మామ కేసీఆర్ పరుగు
By: Tupaki Desk | 11 Sep 2018 7:42 AM GMTఅల్లుడు హరీష్ స్టామినా ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. టీఆర్ఎస్ లో నంబర్ 2గా ఆదిలో హరీష్ పేరుపొందారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాత్రం హరీష్ ప్రభ తగ్గి కేటీఆర్ హవా పెరిగిపోయింది. సీఎం కేసీఆర్ కొడుకుకు పరీక్ష పెడుతూ రాటుదేల్చాడు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలను కేటీఆర్ కు పరీక్షగా పెట్టి కేసీఆర్ సత్ఫలితాలు పొందారు. మంత్రిగా కూడా కేటీఆర్ చెరగని ముద్రవేశారు. కానీ పార్టీలో మాత్రం కేటీఆర్ ప్రయత్నాలు - బలనిరూపణ విఫలమవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. అందుకే ఈ ఎన్నికల్లో అల్లుడు హరీష్ సాయం కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
కేటీఆర్ ప్రభుత్వంలో ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ పార్టీ వ్యవహారాలు నడపడంలో తడబాటు కనిపిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం ఉంది. టికెట్ వ్యవహారాలు - ఎమ్మెల్యే అభ్యర్థులతో వ్యవహారశైలి విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కొండా సురేఖ దంపతులు కేటీఆర్ వల్లే తమకు టికెట్ రాలేదని.. కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. ఇక మిగతా ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే కంప్లైట్ వచ్చింది. అంతేకాదు.. ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన టీఆర్ ఎస్ ప్రగతి నివేదన సభ ఫ్లాప్ అవ్వడం వెనుక కేటీఆర్ దే బాధ్యత అని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. దాదాపు 20 లక్షల మంది వస్తారని ఆనుకోగా ఆశించిన జనం రాలేదు. కేటీఆర్ సారథ్యంలో ఈ సభ ఫ్లాప్ అయినట్టు విమర్శలు వచ్చాయి. కేటీఆర్ ఫ్లాప్ కావడంతో హుస్నాబాద్ సభకు హరీష్ కు బాధ్యతలు అప్పగించగా అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఇక కేటీఆర్ కు సొంత నియోజకవర్గంలో కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే హరీష్ రావుకు ఆ ప్రాబ్లం లేదు. సిద్దిపేటలో హరీష్ ను కొట్టే మగాడు లేడు. హరీష్ మిగతా పార్టీల నేతల డిపాజిట్లు గల్లంతు చేసేలా గెలుస్తాడనే పేరుంది. కానీ కేటీఆర్ గెలిచాక సిరిసిల్ల ముఖం చూడడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కేటీఆర్ ఈసారి సిరిసిల్లలో గెలిచినా అక్కడా ప్రచారం ఎక్కువగా చేయాల్సి ఉంటుందని సమాచారం. అందుకే కేటీఆర్ ను వదిలేసి.. హరీష్ కు కొన్ని నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
హరీష్ రావు సిద్దిపేటలో గెలవడం పక్కా.. పైగా ప్రజల్లో మంచి పాపులారిటీ ఉంది. హరీష్ ట్రబుల్ షూటర్ గా జనంలో ఓట్లు సంపాదించే సామర్థ్యం ఉంది. అదే కేటీఆర్ కు ఆ వెసులుబాటు లేదు. దీంతో కేసీఆర్.. జనంలో ఫుల్ క్రేజ్ ఉన్న అల్లుడు హరీష్ ను తనతోపాటు క్యాంపెయినర్ గా జనంలోకి తీసుకుపోవాలని భావిస్తున్నట్టు సమాచారం.