Begin typing your search above and press return to search.

నేషనల్ హీరో గా మారిన కేసీఆర్

By:  Tupaki Desk   |   7 Dec 2019 4:15 AM GMT
నేషనల్ హీరో గా మారిన కేసీఆర్
X
పాతికేళ్ల వెటర్నరీ డాక్టరు ను అత్యాచారం చేసి తగలబెట్టిన నరరూప రాక్షసులను తెలంగాణ పోలీసులు ఎన్‌ కౌంటర్ చేయడం తో పోలీసులతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని దేశ ప్రజలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. బాధిత కుటుంబానికి కేసీఆర్ సత్వర న్యాయం చేశారంటూ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మహిళా సంఘాలు - ఎన్జీవోలు - కార్పొరేట్ ఉద్యోగులు అంతా స్పందించి కేసీఆర్ న్యాయం చేశారంటున్నారు. పార్లమెంటు లో సైతం పలువురు మహిళా ఎంపీలు తెలంగాణ పోలీసులను - తెలంగాణ సీఎం ను ఆకాశానికెత్తారు.

సినీ - క్రీడారంగాలతో పాటు పలు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ ఘటనలో పోలీసులు - ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. దీంతో కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

బీజేపీ లోని ఎంతోమంది నాయకులు కూడా నేరుగా కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. సాధారణంగా ఇలాంటి ఎన్‌ కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష నేతల్లోనూ చాలామంది దీన్ని సమర్థించారు. సీపీఐ జాతీయ నేత నారాయన ఓపెన్‌ గా దీన్ని సమర్థించారు.

నిజానికి తొలుత దిశ కేసులో కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటూ నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇరకాటంలో పడినప్పటికీ పది రోజుల్లోనే మొత్తం సీను మార్చేయగలిగారు కేసీఆర్.

దిశ అత్యాచార ఘటన వెలుగు చూసిన వెంటనే ఒక జాతీయ చానల్‌ లో హోస్ట్ తెలంగాణ టీఆరెస్ ఎంపీ రంజిత్ కుమార్‌ ను లైన్లోకి తీసుకుని వేరీజ్ యువర్ సీఎం? వేరీజ్ కేసీఆర్? ఏం చేస్తున్నారాయన అంటూ రంకెలేసిన వీడియో వైరల్ అయింది. దాంతో అదే లైన్ లో కేసీఆర్‌ ను విమర్శిస్తూ కథనాలు రావడం తో కేసీఆర్ ఇరకాటం లో పడినా ఇప్పుడు ఈ ఎన్‌ కౌంటర్‌ తో అదే జాతీయ మీడియాలో హీరో గా నిలిచారు.